Homeఎంటర్టైన్మెంట్Panja Heroine: 'పంజా' హీరోయిన్ గుర్తుందా? ఇలా తయారు అయ్యిందేంటి.. కుర్రాళ్ళు చూస్తే పిచ్చెక్కిపోతారు..

Panja Heroine: ‘పంజా’ హీరోయిన్ గుర్తుందా? ఇలా తయారు అయ్యిందేంటి.. కుర్రాళ్ళు చూస్తే పిచ్చెక్కిపోతారు..

Panja Heroine: పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని సినిమాలు ఘోరమైన డిజాస్టర్స్ గా నిల్చిన సంగతి తెలిసిందే. వాటిల్లో ‘పంజా’ కూడా ఒకటి. తమిళ డైరెక్టర్ విష్ణు వర్ధన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఆరోజుల్లో విడుదలైన టీజర్ , టైటిల్ సాంగ్ సెన్సేషన్ సృష్టించడం , ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా పెద్ద హిట్ అవ్వడం తో , కనీవినీ […]

Panja Heroine: పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని సినిమాలు ఘోరమైన డిజాస్టర్స్ గా నిల్చిన సంగతి తెలిసిందే. వాటిల్లో ‘పంజా’ కూడా ఒకటి. తమిళ డైరెక్టర్ విష్ణు వర్ధన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఆరోజుల్లో విడుదలైన టీజర్ , టైటిల్ సాంగ్ సెన్సేషన్ సృష్టించడం , ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా పెద్ద హిట్ అవ్వడం తో , కనీవినీ ఎరుగని అంచనాలు ఈ సినిమాపై ఏర్పడ్డాయి. కానీ మొదటి ఆట నుండే ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. ఆ కారణం చేత కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇకపోతే ఈ చిత్రం లో సారా జైన్ దియాస్ , అంజలి లవానియా హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే.

వీరిలో అంజలి లవానియా సినిమాలకు దూరంగా ఉంటూ , పబ్బులలో డీజే గా కొనసాగుతోంది. ఇక సారా జైన్ దియాస్ విషయానికి వస్తే ఈమె గత ఏడాది వరకు సినిమాల్లో , వెబ్ సిరీస్ లలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ వచ్చింది. తెలుగు ఆడియన్స్ కి ఈమె ముందుగా మంచు విష్ణు ‘గేమ్’ అనే చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ‘పంజా’ చిత్రం తో మంచి ఫేమ్ ని సంపాదించింది. ఈ చిత్రం ఫ్లాప్ అయ్యాక తెలుగు లో ఈమెకు అవకాశాలు రాలేదు. కేవలం ఈమె కారణంగానే సినిమా ఫ్లాప్ అయ్యింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు లో ఈమెకు అవకాశాలు రాకపోయినా , హిందీ లో మాత్రం వరుసగా అవకాశాలు వచ్చాయి. 2024 వ సంవత్సరం లో ఈమె నటించిన ‘ది బకింగ్ హమ్ మర్డర్స్’ అనే చిత్రం హిందీ తో పాటు ఇంగ్లీష్ లో కూడా విడుదలైంది.

ఈమె సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఫోటోలు , వీడియోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే ‘పంజా’ టైం లో కంటే ఇప్పుడే ఎంతో అందం గా ఉంది , కుర్రాళ్లకు పిచ్చేక్కిన్చేలా ఉంది , తెలుగు దర్శక నిర్మాతలు ఈమెని సినిమాల్లోకి హీరోయిన్ గా ఇప్పటికీ తీసుకోవచ్చు , అంత అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇదంతా పక్కన పెడితే ‘పంజా’ చిత్రం అప్పట్లో ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ , నేటి తరం జెన్ జీ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా తెగ నచ్చేసింది. అందుకే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఫ్యాన్స్ , ఆడియన్స్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper