Pawan Kalyan : ఒకప్పుడు డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలిన కొన్ని సినిమాలు , కాలక్రమేణా నేటి తరం ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకొని , రీ రిలీజ్ లో సెన్సేషనల్ హిట్స్ గా నిలిచినవి కొన్ని ఉన్నాయి. అందుకు బెస్ట్ ఉదాహరణలుగా నిల్చిన చిత్రాలు ఖలేజా , ఆరెంజ్. ఈ రెండు సినిమాలు మహేష్ బాబు , రామ్ చరణ్ కెరీర్స్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ చిత్ర నిర్మాతలు ఆరోజుల్లో సంక్షోభం లోకి వెళ్లిపోయారు. అలాంటి ఈ రెండు సినిమాలు రీ రిలీజ్ లో ప్రభంజనమే సృష్టించారు. ఇప్పుడు ఆ జాబితాలోకి పవన్ కళ్యాణ్ ‘పంజా’ చిత్రం కూడా చేరిపోయేలా ఉంది. ఈ సినిమాకు కొత్త తరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో , అదే విధంగా మూవీ లవర్స్ లో క్రేజ్ మామూలు రేంజ్ లో లేదు.
ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఒక కొత్త పవన్ కళ్యాణ్ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో , ఈ సినిమాకు కూడా అలాంటి క్రేజ్ ఏర్పడింది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలే చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ లుక్స్ , స్టైల్ , యాటిట్యూడ్ మ్యానరిజమ్స్ కి మెంటలెక్కిపోతున్నారు జెన్ జీ ఆడియన్స్. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్నీ ప్రాంతాల్లోనూ రికార్డు స్థాయిలో ఫ్యాన్స్ షోస్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక మార్కెట్ లో కూడా ఈ చిత్రానికి డిమాండ్ మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. నైజాం ప్రాంతం లో ఈ సినిమా రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది.
ఇక ఉత్తరాంధ్ర లో అయితే అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా రైట్స్ ని మంచి ఫ్యాన్స్ రేట్ కి కొనుగోలు చేసింది. నాగార్జున నిర్మాణ సంస్థ , పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేయడం తో సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలను నాగార్జున మేనకోడలు సుప్రియ చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈమె పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో స్పెషల్ గా తీసుకుంటూ పంజా చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు.