Homeఎంటర్టైన్మెంట్Panja Re Release: డిజాస్టర్ 'పంజా' రీ రిలీజ్ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఎంత...

Panja Re Release: డిజాస్టర్ ‘పంజా’ రీ రిలీజ్ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఎంత గ్రాస్ వచ్చిందో చూస్తే ఆశ్చర్యపోతారు!

Panja Re Release: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతీ ఏడాది ఆయన పాత సూపర్ హిట్ సినిమాలను 4K క్వాలిటీ కి మార్చి గ్రాండ్ గా రీ రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన ప్రతీ రీ రిలీజ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పాయి. అయితే గత ఏడాది ఆయన కొత్త సినిమాలు విడుదల ఉండడం వల్ల , రీ రిలీజ్ […]

Panja Re Release: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతీ ఏడాది ఆయన పాత సూపర్ హిట్ సినిమాలను 4K క్వాలిటీ కి మార్చి గ్రాండ్ గా రీ రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నుండి విడుదలైన ప్రతీ రీ రిలీజ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పాయి. అయితే గత ఏడాది ఆయన కొత్త సినిమాలు విడుదల ఉండడం వల్ల , రీ రిలీజ్ కుదర్లేదు. కానీ ఈ ఏడాది మాత్రం పవన్ ఫ్యాన్స్ ‘పంజా’ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రమిది. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా , ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయాయి. కానీ కాలక్రమేణా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫేవరేట్ గా మారిపోయింది.

ముఖ్యంగా ‘ఓజీ’ విడుదల తర్వాత ఈ సినిమాకు జెన్ జీ ఆడియన్స్ లో క్రేజ్ విపరీతమైంది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసమే, వచ్చే నెల 2 న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. నిన్నటి నుండి అన్ని ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. బుకింగ్స్ స్పీడ్ సెన్సేషనల్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ లో నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టగానే, షోస్ మొత్తం హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ లో 30 నుండి 40 షోస్ షెడ్యూల్ చేయగా, దాదాపుగా అన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయి. కేవలం హైదరాబాద్ లోనే కాదు నైజాం జిల్లాల్లో కూడా ఈ చిత్రానికి మంచి గ్రాస్ వసూళ్లు బుకింగ్స్ ద్వారా నమోదు అయ్యాయి.

ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి. వైజాగ్, విజయవాడ లతో పాటు , అనేక ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టగా , టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ లో అయితే అప్పుడే 17 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 17 లక్షల రూపాయలకు పైగానే అన్నమాట. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 72 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదంతా కేవలం మార్నింగ్ షోస్ నుండి వచ్చిన గ్రాస్ మాత్రమే. పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ రేపు మొదలు కాబోతున్నట్టు సమాచారం. చూడాలి మరి ఈ చిత్రం గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లను అధిగమిస్తుందా లేదా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper