Honda Rebel 300 – ADV 160: హీరో కంపెనీ నుంచి విడిపోయిన తర్వాత హోండా కంపెనీ ద్విచక్ర వాహనాల మార్కెట్లో స్థిరమైన స్థానం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో యంగ్ జనరేషన్, మిడిల్ ఏజ్ వాళ్లను దృష్టిలో పెట్టుకొని ద్విచక్ర వాహనాలను తయారుచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా Rebel 300 – ADV 160 పేరుతో బైక్, స్కూటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో రెబల్ ధర 2.22 లక్షలు, ఏడీవీ స్కూటర్ ధర 1.70 లక్షలుగా ఉంది.
Honda Rebel 300
తొలిసారిగా హోండా కంపెనీ క్రూజర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి. దీనికి రెబల్ 300 అని పేరు పెట్టింది. ఇందులో 286 సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇందులో ఎల్ఈడి హెడ్ లాంప్.. రోడ్డు సింక్ కనెక్టివిటీతో కూడిన టిఎఫ్టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉంది. టర్న్ బైటర్న్ నావిగేన్, డిస్క్ బ్రేకులు.. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రీమియం మోటార్ సైకిల్ సెగ్మెంట్లో తన వాటాను పెంచుకోవడానికి హోండా కంపెనీ ఈ మోడల్ తీసుకొచ్చింది. వాస్తవానికి ఇదే విభాగంలో రాయల్ ఎన్ఫీల్డ్ మెటోర్ 350, గోన్ క్లాసిక్ 350 మోడల్స్ మార్కెట్లో సందడి సచ్చిస్తున్నాయి రెబల్ 300 కు ఇవి పోటీగా ఉన్నాయి.
Honda ADV 160
హోండా కంపెనీ తీసుకొచ్చిన ఈ స్కూటర్ అడ్వెంచర్ అని చెప్పవచ్చు. ఇది ఫ్లెక్స్ ఫ్యూయల్ ద్వారా నడుస్తుంది. e85 ఇథనాల్ ఇంధనానికి ఇది సరిపోతుంది. ఈ స్కూటర్లో 156.9 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ను హోండా కంపెనీ ఏర్పాటు చేసింది అండర్ సీట్ స్టోరేజ్ విభాగంలో 27 లీటర్ల కెపాసిటీ అందించింది దీనికి తోడు టి ఎఫ్ టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రోడ్డు సింక్ యాప్ కనెక్టివిటీ, టర్న్ బైటర్న్ నావిగేషన్ ను సపోర్ట్ చేస్తాయి. ముందు.. వెనుక భాగంలో డిస్క్ బ్రేకులు ఉన్నాయి. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఫెసిలిటీ కూడా ఉంది. హీరో జూమ్ 160.. యమహా ఎరోక్స్ 155 ద్విచక్ర వాహనాలు కూడా ఇదే తరహాలో ఉన్నాయి. ఈ ప్రకారం చేసుకుంటే ఈ రెండు మోడల్స్ హోండా ఎడివి 160 గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
నేటి కాలానికి తగ్గట్టుగా హోండా కంపెనీ ఈ మోడల్స్ తీసుకొని వచ్చింది. ఈ మోడల్స్ ను అత్యంత ఆధునికంగా తయారు చేసింది. పైగా వీటికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను కూడా హోండా అత్యంత అట్టహాసంగా నిర్వహించింది. అందువల్లే ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఈ రెండు మోడల్స్ విపరీతంగా సందడి చేస్తున్నాయి.