Homeఎంటర్టైన్మెంట్Prakash Raj: ప్రకాష్ రాజ్ తో చేతులు కలిపిన సుస్మిత కొణిదెల.. మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్..

Prakash Raj: ప్రకాష్ రాజ్ తో చేతులు కలిపిన సుస్మిత కొణిదెల.. మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్..

Prakash Raj: పవన్ కళ్యాణ్ , ప్రకాష్ రాజ్ మధ్య రాజకీయ విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం నుండి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. కేవలం ఒక్కసారి మాత్రమే పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పటికీ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన టార్గెట్టెడ్ విమర్శలు చేస్తూనే ఉన్నాడు. […]

Prakash Raj: పవన్ కళ్యాణ్ , ప్రకాష్ రాజ్ మధ్య రాజకీయ విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం నుండి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. కేవలం ఒక్కసారి మాత్రమే పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పటికీ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన టార్గెట్టెడ్ విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ప్రశ్న రావణ్ తో లైవ్ వీడియో చాట్ చేస్తూ , పవన్ కళ్యాణ్ ని ‘వాడు’ అని కూడా సంభోదించాడు. తిరుమల లడ్డు వ్యవహారం లో తనపై విమర్శలు చేసినప్పటికీ కూడా, ప్రకాష్ రాజ్ తో కలిసి ‘ఓజీ’ చిత్రం లో నటించాడు పవన్ కళ్యాణ్. కానీ ఆ తర్వాత ప్రకాష్ రాజ్ విమర్శలు హద్దులు దాటాయి.

దీంతో ఆయనపై సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పీకల దాకా కోపం పెంచుకున్నారు. ఇలాంటి సమయం లో ప్రకాష్ తో మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల చేతులు కలపడం పై సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ నుండి తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ఆమె అమెజాన్ ప్రైమ్ కోసం ‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్ ని నిర్మించింది. ఈ సిరీస్ లో ప్రకాష్ రాజ్ , మధుబాల , శ్రీకాంత్ ప్రధాన పత్రాలు పోషించారు. సెప్టెంబర్ 4 నుండి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. గతం లో అమెజాన్ ప్రైమ్ వీడియో లో ‘బందిష్ బాండిట్స్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ ని ఆధారంగా చేసుకొనే ‘జగమే సంగీతం’ వెబ్ సిరీస్ ని నిర్మించినట్టు తెలుస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ ని ఈ టార్గెట్ చేసి , ఆయన శత్రువులతో చేతులు కలిపి కుట్రలు చేస్తున్న ప్రకాష్ రాజ్ ని , నీ వెబ్ సిరీస్ లో ఎలా పెట్టుకుంటావు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సుస్మిత ని నిలదీస్తున్నారు. అయితే సినిమా వేరు , రాజకీయం వేరు, పాత్రకు ఒక నటుడు అవసరమైతే , ఎన్ని అడ్డంకులు , మనస్పర్థలు ఉన్నప్పటికీ వాళ్ళని తీసుకోవాలి, పవన్ ఫ్యాన్స్ ఒకవేళ పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ లో ప్రకాష్ రాజ్ ని తీసుకుంటే ఏమి చేస్తారు?, కాబట్టి సినిమాని సినిమాలాగానే చూడండి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సంక్రాంతికి సుస్మిత నిర్మాతగా వ్యవహరించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం విడుదలై కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి ‘జగమే సంగీతం’ సిరీస్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper