Panja Re Release: పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ లిస్ట్ తీస్తే, అందులో ‘పంజా’ చిత్రం కచ్చితంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆరోజుల్లో ఈ చిత్రం పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండేవి. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేకపోవడం తో అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. సినిమాకు ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి కానీ, డిజాస్టర్ టాక్ రావడం తో లాంగ్ రన్ దారుణంగా డ్రాప్ అయ్యింది. ఫలితంగా అప్పట్లో కేవలం 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. అయితే ఈ సినిమాకు కాలక్రమేణా జెన్ జీ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఈ సినిమాని కచ్చితంగా రీ రిలీజ్ చెయ్యాలని పట్టుబట్టారు. వాళ్ళ కోరిక మేరకు ఈ చిత్రాన్ని రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు.
ఈ రీ రిలీజ్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉన్నాయి. అనకాపల్లి నుండి అమెరికా వరకు , ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి అప్పుడే 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయట. ఈ రేంజ్ గ్రాస్ ఈమధ్య కాలం లో ఏ సినిమాకు కూడా నమోదు అవ్వలేదని, పవన్ కళ్యాణ్ కి ఓవర్సీస్ మార్కెట్ గుండె లాంటిదని విశ్లేషకులు ఎందుకు అంటుంటారో ఇప్పుడు మరోసారి అర్థం అవుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఇక ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు బుకింగ్స్ ద్వారా నమోదు అయ్యాయి అట. ఒక డిజాస్టర్ సినిమాకు, వర్కింగ్ డే లో ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటాయని కలలో కూడా ఊహించలేదు అంటూ అభిమానులు కూడా ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అట. రేపు విడుదల తర్వాత ఈ చిత్రానికి ఏ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవుతాయో చూడాలి. ఇప్పటికీ రీ రిలీజ్ చిత్రాల్లో మొదటి రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాగా పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఉన్నది. ఈ రికార్డు ని పంజా చిత్రం అందుకోవడం కాస్త కష్టమే కానీ, కచ్చితంగా టాప్ 3 లో ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.