Homeఎంటర్టైన్మెంట్'సర్కారు'లో మహేష్ విలన్ ఫిక్స్ !

‘సర్కారు’లో మహేష్ విలన్ ఫిక్స్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో విలన్ ఎవరనేది ఇంకా టీం అధికారికంగా అనౌన్స్ చెయ్యలేదు. ఆ మధ్య ఎప్పుడో అనిల్ కపూర్ ను విలన్ గా అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత, జాన్ అబ్రహమ్ దగ్గర నుండి విజయ్ సేతుపతి వరకూ, ఉపేంద్ర నుండి వివేక్ ఒబెరాయ్ వరకూ ఇలా చాలా పేర్లు వినిపించినా ఏది ఫైనల్ కాలేదు . అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ ఫైనల్ అయినట్టు […]


సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో విలన్ ఎవరనేది ఇంకా టీం అధికారికంగా అనౌన్స్ చెయ్యలేదు. ఆ మధ్య ఎప్పుడో అనిల్ కపూర్ ను విలన్ గా అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత, జాన్ అబ్రహమ్ దగ్గర నుండి విజయ్ సేతుపతి వరకూ, ఉపేంద్ర నుండి వివేక్ ఒబెరాయ్ వరకూ ఇలా చాలా పేర్లు వినిపించినా ఏది ఫైనల్ కాలేదు .

అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. అరవింద్ స్వామిని విలన్ గా ఫిక్స్ చేశారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. సినిమాలో అరవింద్ స్వామిది విలన్ పాత్ర అయినప్పటికీ, ఆ పాత్ర సినిమాలోనే ఎంతో కీలకమైనది అట. అందుకే కచ్చితంగా స్టార్ డమ్ ఉన్న ఆర్టిస్ట్ మాత్రమే ఆ పాత్రలో నటించాలనుకున్నారు. అందుకే, చిత్రబృందం కూడా ఉపేంద్ర లాంటి హీరోలను ట్రై చేసింది.

ఓ దశలో కేవలం ‘ఉపేంద్ర’ మాత్రమే ఈ పాత్రకు బాగుంటాడని మహేష్ బాబు కూడా ఫీల్ అయ్యాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఉపేంద్ర నెగెటివ్ షేడ్స్ పాత్ర పోషించాడు కాబట్టి.. మహేష్ సినిమా కూడా ఒప్పుకుంటాడని అనుకుంటే, మహేష్ సినిమాని అంగీకరించలేదు. ఇక విలన్ గా చేయడానికి ఎవరు ముందుకు వస్తారు అనుకుంటున్న టైంలో అరవింద స్వామి ఈ పాత్ర చేయడానికి అంగీకరించాడు.

ఎలాగూ అరవింద స్వామికి తమిళంలో క్రేజ్ ఉంది కాబట్టి.. మార్కెట్ పరంగా కూడా హెల్ప్ అవుతుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాలో ఆర్ధిక రంగంలోని లొసుగుల వ్యవహరాలకు, సామాజిక అంశాన్ని జోడించి పరుశురామ్ పక్కా కమర్షియల్ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper