Homeవింతలు-విశేషాలుDog Loyalty: యజమానిని కాటేయకుండా కోబ్రాను చంపేసింది. ఇదీ కుక్కవిశ్వాసం అంటే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Dog Loyalty: యజమానిని కాటేయకుండా కోబ్రాను చంపేసింది. ఇదీ కుక్కవిశ్వాసం అంటే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

Dog Loyalty: చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఇంటి పక్కనే ఉన్న చెట్లలో బుస్ మని శబ్దం వచ్చింది. అక్కడే ఓ కుక్క ఉంది. అదేపరిగా ఆ శబ్దాన్ని వింటోంది. పైగా కుక్కలకు దృష్టి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. అలా అంటున్న జంతువేదో గుర్తుపట్టింది. కుక్కలను విశ్వాసానికి ప్రతీకలు అని చెబుతుంటారు. కుక్కలకు మనుషులకు అనాదికాలం నుంచి స్నేహం ఉంది. కాసింత అన్నం పెట్టి.. కూసింత గూడు కల్పిస్తే కుక్కలు ఎంతో విశ్వాసాన్ని మనుషుల మీద చూపిస్తుంటాయి. […]

Dog Loyalty: చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఇంటి పక్కనే ఉన్న చెట్లలో బుస్ మని శబ్దం వచ్చింది. అక్కడే ఓ కుక్క ఉంది. అదేపరిగా ఆ శబ్దాన్ని వింటోంది. పైగా కుక్కలకు దృష్టి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. అలా అంటున్న జంతువేదో గుర్తుపట్టింది.

కుక్కలను విశ్వాసానికి ప్రతీకలు అని చెబుతుంటారు. కుక్కలకు మనుషులకు అనాదికాలం నుంచి స్నేహం ఉంది. కాసింత అన్నం పెట్టి.. కూసింత గూడు కల్పిస్తే కుక్కలు ఎంతో విశ్వాసాన్ని మనుషుల మీద చూపిస్తుంటాయి. చివరికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టైనా సరే మనుషులను కాపాడుతుంటాయి. ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ తరహా వీడియోలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బల్లియ అనే ప్రాంతంలో ఓ ఇంట్లోకి నాగుపాము వచ్చింది. అది అత్యంత విషపూరితమైనది. పైగా అత్యంత పొడవుగా ఉంది. ఆ పాము శబ్దాన్ని విన్న ఆ ఇంటి యజమాని కుక్క వెంటనే స్పందించింది. ఆ పాము ఇంట్లోకి రాకుండా అడ్డుకుంది. తనను కాటు వేస్తుంది.. ఆ విషయం వల్ల తాను చనిపోతాను అని తెలిసినప్పటికీ కూడా కుక్క ఆ పామును పట్టుకుంది. తన పదునైన దంతాలతో కొరికింది. అయితే ఆపాము ఆ కుక్కను కాటు వేసింది. ఆ విషం ప్రభావంతో ఆ కుక్క ఏమాత్రం భయపడకుండా ఆ పామును అలానే చంపేసింది. అర్థగంట తర్వాత ఆ కుక్క ఆ పాము విషం తీవ్రత వల్ల నురగలు కక్కుకుంటూ చనిపోయింది.

పాము కాటు వేసిన తర్వాత ఆ ఇంటి యజమాని ఆ కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కాకపోతే అప్పటికే దాని ఒంట్లో విషం మొత్తం పాకడంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు. విషం ప్రభావం వల్ల ఆ కుక్క చూస్తుండగానే చనిపోయింది. యజమాని ఇంట్లోకి పామును రాకుండా ఆ కుక్క అడ్డుకున్నది. చివరికి తన ప్రాణాలను సైతం పోగొట్టుకున్నప్పటికీ ఆ పామును చంపేసింది. ఈ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా విస్తృతమైన వ్యాప్తిలోకి వచ్చింది. కుక్కను విశ్వాసానికి ప్రతీకలుగా ఎందుకు చెబుతారు.. కుక్కలు ఆ స్థాయిలో విశ్వాసాన్ని ఎందుకు కలిగి ఉంటాయి.. అనే వాటికి ఈ వీడియో ఒక బలమైన ఉదాహరణ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper