Mahesh Babu Namrata: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి చాలా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు ఒక సినిమా కథని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ముందుగా ఆ కథను తమ భార్య అయిన నమ్రత వింటుంది. ఆమె ఫైనల్ చేసిన తర్వాతే మహేష్ బాబు ఆ కథలను విని తను కూడా ఆ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ఇక ఏది ఏమైనా కూడా నమ్రత ఒక సినిమా విషయంలో మహేష్ బాబుతో వద్దని వాదించినా కూడా వినకుండా మహేష్ బాబు ఆ సినిమా చేశారట. దాంతో ఆ మూవీ రిజల్ట్ తేడా కొట్టింది అంటూ కొంతమంది కొన్ని రకాల కామెంట్లు చేస్తున్నారు. నిజానికి నమ్రత వద్దని చెప్పిన సినిమా ఏంటి అంటే పరుశురాం డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా చేసిన ‘సర్కారు వారి పాట’ సినిమా కావడం విశేషం…
ఆ కథ నమ్రత కి పెద్దగా నచ్చలేదట. ఎందుకంటే ఆ సినిమా రొటీన్ కమర్షియల్ టెంప్లేట్ లోనే ఉందని మహేష్ బాబు అలాంటి సినిమాలు చాలానే చేశారని ఇది చేయడం వల్ల కొత్తగా ఆయనకి వచ్చే ఇమేజ్ ఏమీ లేదని చెప్పిందట. పైగా మహేష్ బాబు రొటీన్ సినిమాలను చేస్తున్నాడు అనే ఒక రీమార్క్ ని కూడా మూట గట్టుకోవాల్సి వస్తుందని ఆమె చాలా వరకు వాదించిందట.
కానీ మహేష్ బాబు మాత్రం నమ్రత మాట వినలేదట. ఇక ఏది ఏమైనా కూడా ఆ సినిమా ఆవరేజ్ గా ఆడింది. మహేష్ బాబు భారీ సక్సెస్ సాధించలేదనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు మహేష్ బాబు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్న ‘వారణాసి’ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది.
ఈ సినిమా ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు మహేష్ బాబును పరిచయం చేయబోతుంది. తద్వారా మహేష్ బాబు హాలీవుడ్ రేంజ్ హీరోగా మారబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తనకు హాలీవుడ్ నుంచి కూడా చాలా అవకాశాలు వచ్చే ఛాన్సులైతే ఉన్నాయి…