Paradise: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు వాళ్లు చేస్తున్న సినిమాల విషయంలో చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నారు. అయినప్పటికి వాళ్లకి సరైన సక్సెస్ రావడం లేదు. ఇక నాని లాంటి హీరో సైతం మీడియం రేంజ్ హీరోగా ఉన్నప్పటికి డిఫరెంట్ ప్రయత్నాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేసుకుంటున్నాడు.
తద్వారా ఆయనకంటూ ఒక మార్కెట్ ను ఏర్పాటు చేసుకొని భారీ కలెక్షన్ ను కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన చేసిన ‘ప్యారడైజ్ ‘ సినిమా తొందరలోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.
అయితే ఈ టీజర్ ఎలా ఉండబోతుంది అనేది పక్కన పెడితే ఈ సినిమాలో ఒక యాక్షన్ బ్లాక్ ని కావాలనే శ్రీకాంత్ ఓదెల చాలా స్టైలిష్ గా తెరికెక్కించినట్టుగా తెలుస్తుంది. తన అండర్ లోనే ఫైట్ మాస్టర్ ని పెట్టుకొని తనకి ఎలాంటి విజువల్స్ కావాలో వాటిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే విధంగా వాటిని ప్లాన్ చేశారట.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో శ్రీకాంత్ మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోగలిగితే మాత్రం టాప్ పొజిషన్ కి వెళ్తాడు. లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డీలా పడిపోయే ప్రమాదమైతే ఉంది. ఇక ఇప్పటికే ఆయనకు దసరా సినిమాతో ఇండస్ట్రీలో గొప్ప పేరైతే దక్కింది. తద్వారా ఆయన అదే ఊపు లో టాప్ పొజిషన్ కి వెళ్తాడా లేదంటే డీలా పడిపోతాడా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…