Actor Brahmaji: కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు బ్రహ్మాజీ. మూడు దశాబ్దాల పైన నుండి ఆయన సినీ ఇండస్ట్రీ లో క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. హీరో గా , విలన్ గా , కమెడియన్ గా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన బ్రహ్మాజీ , నేటి తరం ఆడియన్స్ కి కూడా అదే తరహా లో ఎంటర్టైన్ చేయడం అనేది సాధారణమైన విషయం కాదు. సినిమాల్లోనే కాదు, బయట కూడా బ్రహ్మాజీ చాలా సరదాగా ఉండే మనిషి. తన తోటి ఆర్టిస్టులతో ఈయన వేసే జోకులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతుంటాయి. అయితే కొంతకాలం క్రితం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘పిల్లలకు ఆస్తులు సంపాదించి ఇవ్వడం అనేది మంచిది కాదు. ఎందుకంటే నీ తర్వాతి తరం వాళ్ళు ఆ ఆస్తిని నాశనం చేస్తారేమో అనేది నీకు తెలియదు కాబట్టి. కానీ వాళ్లకు ఒక బేసిక్ సెక్యూరిటీ ఇవ్వాలంతే. మిగతాది మనం ఖర్చు పెట్టుకోవాలి. ఉన్నది ఒక్కటే జీవితం , ప్రపంచం చూడండి , బాగా తిరగండి, పది మందికి సహాయం చేయండి. మీ చుట్టూ ఉన్నవాళ్ళని బాగా చూసుకోండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు నష్టపోకుండా చూడండి. నా చుట్టు పక్క ఉండే ప్రతీ ఒక్కరికి అవసరమైనప్పుడల్లా సహాయం చేస్తూనే ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో భిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
ఇంతకీ నువ్వు ఎవరికీ సహాయం చేసావని కొంతమంది అంటుంటే , మరి కొంతమంది ఇలా చేస్తే ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దలు అనాధాశ్రమం లో ఉంటారని , ఇక మీరు మాకు అవసరం లేదని అనుకుంటారని , బాగా ఆస్తులు సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రులని స్మశానం లో వదిలి వస్తున్న రోజులివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బ్రహ్మాజీ కెరీర్ విషయానికి వస్తే, ఈయనతో పాటు కెరీర్ ని ప్రారంభించిన వాళ్ళు , ఈయన తర్వాత ఇండస్ట్రీ లోకి వచినవాళ్లలో ఎంతో మంది సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉంటే , బ్రహ్మాజీ మాత్రం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు. రెండు వారాల గ్యాప్ లో ఈమధ్య కాలం లోనే ఆయన కీలక పాత్రలు పోషించిన ‘లెనిన్’, ‘శ్రీనివాస మంగపురం’ వంటి చిత్రాలు విడుదల అయ్యాయి. ఇలా టాలీవుడ్ ఇప్పటికీ మోస్ట్ డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా గా శివాజీ కొనసాగుతూనే ఉన్నారు.