తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు. కానీ దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ మాత్రం ఎవరు లేరనే చెప్పాలి. ఆయన ఒక్కో సినిమాతో తన బ్యానర్ యొక్క పరువు నిలబెడుతూ వచ్చాడు. ఒకానొక సందర్భంలో దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేయచ్చు అనే రేంజ్ లో గుర్తింపునైతే తెచ్చుకున్నాడు. అలాంటి దిల్ రాజు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమా విషయంలో క్లారిటి మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాడు. రీసెంట్ గా దిల్ రాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన తొలిప్రేమ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా చేయడం వల్లే మేము ప్రొడ్యూసర్లుగా మారాం అంటూ ఒక సంచలమైన విషయాన్ని చెప్పాడు.
తొలిప్రేమ సినిమాకు డిస్ట్రిబ్యూషన్ 70 లక్షలు పెట్టి నైజాం రైట్స్ తీసుకుంటే ఆ సినిమా రెండున్నర కోట్లు కలెక్షన్స్ ని రాబట్టిందట. దాదాపు 2 కోట్ల వరకు ప్రాఫిట్స్ రావడమే కాకుండా వెంటనే మేము ప్రొడ్యూసర్లుగా మారి దిల్ సినిమా చేయడానికి కూడా చాలా వరకు హెల్ప్ చేసిందని దిల్ రాజు తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
మొత్తానికైతే దిల్ రాజు ప్రస్తుతం టాప్ ప్రొడ్యూసర్ గా మారడమే కాకుండా ఇతరులతో పోటీ లేకుండా తనకంటూ ఒక సపరేట్ సినిమాను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సినిమా వల్లే మేము ప్రొడ్యూసర్లుగా మారాము అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమానిని ఆనందంపించేస్తున్నాయి…
పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ అనే సినిమాను ప్రొడ్యూస్ చేసిన విషయం మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేస్తానని కూడా గతంలో ఆయన అనౌన్స్ చేశాడు. మరి తొందరలోనే వీళ్ళ కాంబినేషన్లో మరో సినిమా పట్టలెక్కే అవకాశం కూడా ఉంది…