Ramayan Movie: సుమారుగా 4000 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నితీష్ తివారి తెరకెక్కించిన ‘రామాయన్’ పై ఎందుకో ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయి అంచనాలు క్రియేట్ అవ్వడం లేదు. రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి కూడా అంతంత మాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. రణబీర్ కపూర్ , యాష్ , సన్నీ డియోల్ , సాయి పల్లవి , రకుల్ ప్రీత్ సింగ్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ , ఈ సినిమాకు హైప్ రావడం లేదు. అయితే మేకర్స్ లో మాత్రం ఈ సినిమా కంటెంట్ పై చాలా బలమైన నమ్మకం ఉంది. కచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతాలను నెలకొల్పటండి అనే అంచనాలతో ఉన్నారు. మరి ఆ అంచానాలు ఈ సినిమా ఎంత మాత్రం అందుకుంటుందో తెలియాలంటే నవంబర్ 6 వరకు ఎదురు చూడాల్సిందే.
అయితే ఈ సినిమాకు ‘గాడ్జిల్లా’ రూపం లో పెద్ద ముప్పు ఎదురైంది. ఈ సినిమా విడుదలైన రోజునే ‘గోడ్జిల్లా మైనస్ జీరో’ అనే చిత్రం విడుదల కాబోతుంది. మూడేళ్ళ క్రితం జపాన్ లో నిర్మితమై , ఇతర భాషల్లో అనువాదమై సంచలన విజయం సాధించిన ‘గోడ్జిల్లా మైనస్ వన్’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అందుకే ఈ సినిమా పై వెస్ట్రన్ దేశాల్లోనే కాదు , ఇండియా లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా జెన్ జీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26 న న్యూ యార్క్ లో జరగబోయే ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాని ప్రత్యేకంగా కొంతమంది ఆహ్వానితులకు మాత్రమే ప్రీమియర్ వేయబోతున్నారు. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన థియేటర్స్ అగ్రీమెంట్స్ రికార్డు స్థాయిలో జరిగిపోయాయి అట.
మన ఇండియా లో కూడా ఈ చిత్రం కనీవినీ ఎరుగని రేంజ్ లో భారీ రిలీజ్ ని సొంతం చేసుకోబోతుంది. మరీ ముఖ్యంగా ఐమాక్స్ స్క్రీన్స్ ని లాక్ చేస్తున్నారట. దీంతో ‘రామాయన్ ‘ చిత్రానికి ఓపెనింగ్స్ నుండే గట్టి ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ సినిమా రిలీజ్ పై ఎలాంటి టెన్షన్ పడట్లేదట నిర్మాతల్లో ఒకరైన నమిత మల్హోత్రా. ఎందుకంటే ఈ సినిమాని సోనీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేయబోతుంది. వాళ్ళు కచ్చితంగా భారీ రిలీజ్ ఇస్తారనే నమ్మకం తో ఉన్నారట. మరి ఈ రాకాసి గాడ్జిల్లా ని , ‘రామాయన్’ తట్టుకొని నిలబడగలదా లేదా అనేది చూడాలి.