Homeఎంటర్టైన్మెంట్Bonda Uma Vs Malladi Vishnu: బోండా ఉమా వర్సెస్ మల్లాది విష్ణు.. విజయవాడలో...

Bonda Uma Vs Malladi Vishnu: బోండా ఉమా వర్సెస్ మల్లాది విష్ణు.. విజయవాడలో కొట్టుకున్నారు..

Bonda Uma Vs Malladi Vishnu: ఏపీ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసిపి ఆరోపిస్తోంది. ఢిల్లీలో నీట్ తరహాలో జరిగినట్టుగానే ఏపీలో కూడా ఉద్యమం నిర్వహించాలని.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని వైసీపీ భావిస్తోంది. అందువల్లే సొంత మీడియా.. సొంత యూట్యూబ్ ఛానల్స్.. సొంత సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా ప్రచారం చేస్తోంది. జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు. దీక్షలలో డీఎస్సీ వ్యవహారం వరకు వైసిపి నేతలు ఆగిపోయి ఉంటే […]

Bonda Uma Vs Malladi Vishnu: ఏపీ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసిపి ఆరోపిస్తోంది. ఢిల్లీలో నీట్ తరహాలో జరిగినట్టుగానే ఏపీలో కూడా ఉద్యమం నిర్వహించాలని.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని వైసీపీ భావిస్తోంది. అందువల్లే సొంత మీడియా.. సొంత యూట్యూబ్ ఛానల్స్.. సొంత సోషల్ మీడియా ద్వారా రకరకాలుగా ప్రచారం చేస్తోంది.

జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నేతలు దీక్షలు చేస్తున్నారు. దీక్షలలో డీఎస్సీ వ్యవహారం వరకు వైసిపి నేతలు ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ వారు ప్రభుత్వం మీద లేనిపోని ఆబాండాలు వేస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. వ్యక్తుల మధ్య.. కులాల మధ్య కుంపట్లు రగిలించేందుకు కుట్రలు చేస్తున్నారు. మొదట్లో ఈ వ్యవహారాన్ని పెద్దగా టిడిపి నేతలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పట్టించుకోకుంటే బాగోదని భావించి.. వారి స్టైల్లో యాక్షన్ తీసుకుంటున్నారు.

విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో డీఎస్సీ లో అక్రమాలు జరిగాయి అంటూ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష కార్యక్రమంలో ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం.. అనవసరమైన విషయాల జోలికి వెళ్లడంతో.. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ముత్యాలపాడు ప్రాంతంలో మల్లాది విష్ణు చేస్తున్న దీక్ష వద్దకు ఉమామహేశ్వరరావు వెళ్లారు. ఆయన వెంట టిడిపి కార్యకర్తలు కూడా ఉన్నారు. ఉమామహేశ్వరరావు రాగానే.. మల్లాది విష్ణు వర్గం నాయకులు కూడా తెరమీదికి వచ్చారు. దీంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో పరిస్థితి ఒక్కసారిగా అదుపుతప్పింది. విష్ణు టెంట్ ను టిడిపి నేతలు తొలగించారు. దీంతో వైసిపి నాయకులు ఆందోళనకు దిగారు. అటు టిడిపి నాయకులు కూడా తగ్గేది లేదు అన్నట్టుగా దూసుకు వచ్చారు..

అటు వైసిపి కార్యకర్తలు.. ఇటు టిడిపి కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఉమామహేశ్వరరావు రావడం.. మల్లాది విష్ణు గట్టిగా నినాదాలు చేయడంతో.. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. చివరికి పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా టిడిపి నేతలు అకారణంగా తమ టెంట్ తొలగించారని వైసీపీ నేతలు అంటుంటే.. రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే పనిష్మెంట్ ఇదే విధంగా ఉంటుందని టిడిపి నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper