Spider Man Brand New Day: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలేవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. గత నెలలో లెనిన్ సినిమాతో అఖిల్ కొంతవరకు సక్సెస్ ని సాధించినప్పటికి ఆ తర్వాత వచ్చిన సినిమాలు వచ్చినట్టు ఫ్లాప్ అవుతున్నాయి. హాలీవుడ్ నుంచి వచ్చిన ‘స్పైడర్ మాన్ బ్రాండ్ న్యూ డే’ మూవీ భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు సాగుతుంది. ఈ వారం ఈ సినిమాకి బ్రేకులు వేయడానికి తెలుగు నుంచి కొన్ని సినిమాలైతే రిలీజ్ అవుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా స్పైడర్ మాన్ మూవీ కి చెక్ పెట్టబోతుంది అనేది మనం ఒకసారి తెలుసుకుందాం… నిజానికి కేడి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కిరణ్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత చేసిన KJQ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు దర్శకుడు చనిపోవడం అనేది కొంతవరకు ఇబ్బంది పెట్టే విషయమే అయినప్పటికీ ఈ సినిమాను మాత్రం చాలా బాగా తెరకెక్కించాడనే వార్తలైతే వస్తున్నాయి.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ ని సాధించి తన ఆత్మకు శాంతి కలగాలని సినిమా యూనిట్ కోరుకుంటుంది. ఇక అందులో భాగంగానే సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది కాబట్టి ఈ సినిమా స్పైడర్ మాన్ సినిమా కలెక్షన్స్ కి చెక్ పెట్టే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక దాంతోపాటుగా తమిళ స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు హీరోగా అరుణ్ ముక్తేశ్వర్ దర్శకత్వంలో దొరికేకుతున్న డిసి సినిమా సైతం రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమా కూడా స్పైడర్ మాన్ కలెక్షన్స్ కి చెక్ పెట్టే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక వరుణ్ తేజ్ హీరోగా మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమా సైతం కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతుంది. ఈ సినిమా కూడా స్పైడర్ మాన్ సినిమాకి చెక్ పెట్టే అవకాశాలైతే ఉన్నాయి…ఇక దీంతో పాటుగా మరి కొన్ని చిన్న సినిమాలు సైతం రిలీజ్ అవుతున్నాయి వాటిలో ఏ మూవీ సక్సెస్ అవుతుందనేది తెలియాల్సి ఉంది…