
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్న ఆస్ట్రేలియా బృందం ఎట్టకేలకు తమ ఇళ్లకు చేరుకున్నది. ఆస్ట్రేలియా ప్రభుత్వం సిడ్నీలో ఏర్పాటు చేసిన 14 రోజుల క్వారంటైన్ ను పూర్తి చేసుకొని సోమవారం ఇళ్లకు చేరుకున్నారు. 38 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కామెంటేటర్లు, సహాయక కోచింగ్ సిబ్బంది దాదాపు రెండు నెలల తర్వాత కుటుంబ సభ్యులను కలవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. సందర్భంగా కుటుంబ సభ్యులను సంతోషంతో దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.