Homeఎంటర్టైన్మెంట్Aata Sandeep: ఎంత డబ్బులైన ఇస్తా.. నాతో వారం గడుపు అంటూ ఆట సందీప్ కి...

Aata Sandeep: ఎంత డబ్బులైన ఇస్తా.. నాతో వారం గడుపు అంటూ ఆట సందీప్ కి అమ్మాయి బంపర్ ఆఫర్..

Aata Sandeep: టాలీవుడ్ లో మాత్రమే కాదు , ప్రతీ ఇండస్ట్రీ లోనూ క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. బహిరంగంగా ఎంతో మంది హీరోయిన్స్ మీడియా ముందుకొచ్చి , తాము ఇండస్ట్రీ లో ఎదురుకున్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సమస్య కేవలం ఆడవాళ్లకు మాత్రమే కాదు , మగవాళ్లకు కూడా ఉందని రీసెంట్ గా ప్రముఖ కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్ చెప్తే కానీ తెలియలేదు. […]

Aata Sandeep: టాలీవుడ్ లో మాత్రమే కాదు , ప్రతీ ఇండస్ట్రీ లోనూ క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. బహిరంగంగా ఎంతో మంది హీరోయిన్స్ మీడియా ముందుకొచ్చి , తాము ఇండస్ట్రీ లో ఎదురుకున్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సమస్య కేవలం ఆడవాళ్లకు మాత్రమే కాదు , మగవాళ్లకు కూడా ఉందని రీసెంట్ గా ప్రముఖ కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్ చెప్తే కానీ తెలియలేదు. ఈయన్ని అందరూ ‘ఆట సందీప్’ అని పిలుస్తుంటారు. బుల్లితెర లో ఎన్నో ప్రముఖ డ్యాన్స్ షోస్ లో కంటెస్టెంట్ గా , కొరియోగ్రాఫర్ గా చేసిన ఈయన , నేడు టాలీవుడ్ లోనే మోస్ట్ డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్స్ లో ఒకరిగా మారిపోయాడు. ఆయన గత కొంతకాలం క్రితం తనకు ఎదురైనా క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘నాకు కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురయ్యాయి. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో కొంతమంది అమ్మాయిలు డబ్బులు ఇస్తాం , మాతో గడుపుతావా అని మెసేజిలు చేసేవారు. రీసెంట్ ఆ కూడా ఒక అమ్మాయి ఇలాగే మెసేజ్ చేసింది. తాను అమెరికా నుండి వచ్చానని, ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నానని, ఒక వారం రోజులు ఎంజాయ్ చెయ్యాలని ఉందని , డబ్బులిస్తా, నాతో గడుపుతావా అని మెసేజ్ పెట్టారు. అసలు ఆమె ఎవరో ఏంటో , నా నెంబర్ ఆమె దగ్గరకు ఎలా వచ్చిందో ఏమి అర్థం అయ్యేది కాదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ సందీప్ మాస్టర్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు మరోసారి బాగా వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీ లో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా?, చాలా విచిత్రంగా ఉందే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సందీప్ మాస్టర్ కెరీర్ విషయానికి వస్తే , ప్రస్తుతం టాలీవుడ్ లో ఈయన రేంజ్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంది. ఒకప్పుడు టీవీ షోస్ చేస్తూ సినిమాల్లో ఒక్క సినిమాకు కొరియోగ్రఫీ చేస్తే చాలు అనుకునే వాడు సందీప్. కానీ బిగ్ బాస్ షో కి వచ్చిన తర్వాత ఈయన జాతకమే మారిపోయింది. టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడిన సందీప్ మాస్టర్ కి వరుస పెట్టి అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. మొదట్లో చిన్న సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ వచ్చిన సందీప్ మాస్టర్ కి మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం లోని ‘హుక్ స్టెప్’ పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు. ఈ పాటలో చిరు వేసిన స్టెప్పులు సెన్సేషన్ అవ్వడం తో సందీప్ మాస్టర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం లోని ఐటెం సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఈయన పాన్ ఇండియా రేంజ్ కి కూడా వెళ్లొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper