SS Rajamouli: ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాజమౌళి అనే పేరు కి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన పేరు మీద వేల కోట్ల వ్యాపారాలు జరుగుతుంటాయి. ఒక బిగ్గెస్ట్ స్టార్ హీరో కి పాన్ ఇండియా లెవెల్ లో ఎంత క్రేజ్ ఉంటుందో , అంతకు మించిన క్రేజ్ రాజమౌళి కి ఉంటుంది. అందుకే రాజమౌళి ఏ హీరో తో సినిమా చేసినా , ఆయన ఇమేజ్ హీరో ఇమేజ్ ని డామినేట్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో ‘వారణాసి’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇకపోతే రాజమౌళి కోడలు పూజ ప్రసాద్ కూడా , రాజమౌళి లాగానే గొప్ప ప్రతిభ ఉన్న అమ్మాయి అనే సంగతి మీకు తెలుసా?.
ఈమె ఒక గొప్ప సింగర్. కానీ తన సింగింగ్ టాలెంట్ ని సినిమాలకు కాకుండా , కేవలం దేవుడికి మాత్రమే సమర్పించింది. ఇప్పటి వరకు ఈమె భక్తి గీతాలు వందల సంఖ్యలో పాడింది అట. సినిమాల్లో పాడేందుకు ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమె ఒప్పుకోలేదట. అంతే కాదు , ఈమెకు గొప్ప సినీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉందట. టాలీవుడ్ లెజండరీ స్టార్ నిర్మాత వీ.బి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు ఈమె. ఈయన కొడుకు జగపతి బాబు అనే విషయం అందరికీ తెలిసిందే. పూజ ప్రసాద్ కి జగపతి బాబు స్వయానా పెద్దనాన్న అవుతాడు. అంటే కాదు , ఈమె తండ్రి రాంప్రసాద్ కూడా గొప్ప వ్యాపారవేత్త. వేల కోట్ల ఆస్తులతో పాటు , ప్రముఖ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గానే ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో రాంప్రసాద్ జరిపిన సరదా సంభాషణ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది .
ఈ వీడియో లో నారా లోకేష్ కార్తికేయ , పూజ ప్రసాద్ జంటలను కలుస్తాడు. పూజ తో మాట్లాడుతూ ‘కార్తికేయ బాగా చూసుకుంటున్నాడా అమ్మా?, ఒకవేళ చూసుకోకపోతే నాకు చెప్పు’ అంటూ సరదాగా మాట్లాడుతాడు. ఇలా పూజ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మెగా , నందమూరి కోడళ్ళకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కార్తికేయ, పూజ ప్రసాద్ జంట వివాహం 2018 వ సంవత్సరం లో , రాజస్థాన్ లోని జైపూర్ ప్యాలస్ లో అంగరంగ వైభవం గా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ప్రభాస్, రామ్ చరణ్ , ఎన్టీఆర్ , నాగార్జున ఇలా ఎంతో మంది టాలీవుడ్ దిగ్గజాలు హాజరై చిందులు వేసిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.