Homeఎంటర్టైన్మెంట్Nani: 9 నెలలు అన్నం తినడం మానేసిన నేచురల్ స్టార్ నాని.. కారణం తెలిస్తే కన్నీళ్లు...

Nani: 9 నెలలు అన్నం తినడం మానేసిన నేచురల్ స్టార్ నాని.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు..

Nani: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ వాతావరణం లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. బోలెడంత టాలెంట్ తో పాటు , అదృష్టం, కష్టపడే తత్త్వం కూడా ఉండాలి. ఈ మూడు పర్ఫెక్ట్ గా కుదిరినప్పుడే ఇండస్ట్రీ లో సక్సెస్ కాగలరు. అలా సక్సెస్ అయిన హీరోల్లో ఒకరు నేచురల్ స్టార్ నాని. ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ […]

Nani: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ వాతావరణం లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం. బోలెడంత టాలెంట్ తో పాటు , అదృష్టం, కష్టపడే తత్త్వం కూడా ఉండాలి. ఈ మూడు పర్ఫెక్ట్ గా కుదిరినప్పుడే ఇండస్ట్రీ లో సక్సెస్ కాగలరు. అలా సక్సెస్ అయిన హీరోల్లో ఒకరు నేచురల్ స్టార్ నాని. ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఈయన , యాక్సిడెంటల్ గా హీరో గా మారాడు. తొలిసినిమా ‘అష్టా చమ్మా’ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో , నాని కి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ , అంచలంచలుగా ఎదుగుతూ , వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టే హీరోల లీగ్ లోకి చేరాడు.

త్వరలో విడుదల అవ్వబోయే ‘ది ప్యారడైజ్’ తో 200 కోట్ల గ్రాస్ ని కూడా కొల్లగొట్టి , పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు నాని. ఈ స్థాయికి ఎదగడానికి నాని పడిన కష్టాలు ఎలాంటివో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు. గతం లో ఆయన ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్ ని సోషల్ మీడియా లో నాని ఫ్యాన్స్ మరోసారి షేర్ చేయగా, అది ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘సాధారణంగా షూటింగ్ సమయం లో లంచ్ విరామం అప్పుడు కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది , లేదా సెట్ లో ఉన్న వారంతా బయటకు వస్తుంటారు. కానీ నేను మాత్రం వచ్చేవాడిని కాదు. ఆ సమయం లో తాను బయట భోజనం చెయ్యడానికి వెళ్తే , అత్యంత కీలకమైన వ్యక్తుల దృష్టిలో పడలేనని భావించి భోజనం మానేయాలని నిర్ణయించుకున్నాను’.

‘అలా దాదాపుగా 9 నెలల వరకు మధ్యాహ్నం సమయం లో భోజనం చేయకుండా ఎదురు చూసేవాడిని. ఇక నన్ను వదిలేలా లేదు వీడు అని అభావించి , నాకు అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ ని ఇచ్చారు’ అంటూ చెప్పుకొచ్చాడు నాని. కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ని సంపాదించడానికి నాని ఎంత కష్టపడ్డాడో చూడండి. ఒకవేళ ఆ పోస్టు సంపాదించకపోయుంటే పెద్దల దృష్టిలో పడేవాడా?, హీరో అయ్యేవాడా?.. ఇలాంటి స్ఫూర్తి యువతలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కష్టపడి జీవితం లో పైకి రావాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ క్రమం లో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదు అని చెప్పడానికి నిదర్శనమే నాని సినీ ప్రయాణం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper