Bigg Boss Agnipariksha 2: ఎంతో ప్రతిష్టాత్మకంగా , భారీ హైప్ మధ్య మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. వచ్చే ఆదివారం నుండి ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ గా మొదలు అవ్వబోతుంది. 25 వేలమంది అప్లికేషన్స్ నుండి కేవలం 70 మంది ఆడిషన్స్ కి సెలెక్ట్ అవ్వగా, అందులో నుండి కేవలం 15 మంది మాత్రమే ఈ ‘అగ్ని పరీక్ష 2’ లో పాల్గొన్నారు. వీరిలో కేవలం 13 మంది మాత్రమే మిగిలారు. వీళ్ళు ప్రస్తుతం ఓటింగ్ లైన్ లో ఉన్నారు. అయితే ‘అగ్ని పరీక్ష’ మొదటి సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి రెమ్యూనరేషన్ ఒక్క పైసా కూడా ఇవ్వలేదట మేకర్స్. పైగా ఆ షో లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి లక్షకు పైగా ఖర్చులు అయ్యాయి అట. కానీ ఈ సీజన్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. ఆడిషన్స్ లో పాల్గొన్నప్పుడు కంటెస్టెంట్స్ కి ఎలాంటి రెమ్యూనరేషన్ ఇవ్వలేదట.
కానీ టాప్ 15 గా మిగిలిన కంటెస్టెంట్స్ కి మాత్రం చెరో లక్ష రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చారట. అంతే కాకుండా, వాళ్ళు ఉండేందుకు రూమ్ ఖర్చులు, ఆహారం ఖర్చులు కూడా బిగ్ బాస్ మేకర్స్ భరించారు అట. అంటే దీన్ని బట్టీ ఈ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. వివాదాల కారణంగానే ఈ షో ఇంత పెద్ద హిట్ అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు. జడ్జీలు కంటెస్టెంట్స్ తో వ్యవహరించిన తీరు పై ట్రోల్స్ రావడం, ఆ తర్వాత ఇంత గొడవ జరుగుతుందంటే కచ్చితంగా ఎదో విశేషం ఉండే ఉంటుంది అనే ఉద్దేశ్యం తో ఈ షో ని చూడడం మొదలు పెట్టిన ఆడియన్స్ ఎక్కువ ఉంటారని అంటున్నారు విశ్లేషకులు.
ఆ కారణం చేతనే రికార్డు స్థాయి వ్యూయర్ షిప్ రావడంతో భారీ లాభాలు అర్జించడం వల్ల టాప్ 15 కంటెస్టెంట్స్ కి రెమ్యూనరేషన్స్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఓటింగ్ ట్రెండ్ విషయానికి వస్తే, ఎప్పటి లాగానే, ఇప్పుడు కూడా అందరికంటే టాప్ స్థానం లో అత్యధిక ఓట్లతో ముందుకు దూసుకెళ్తున్నాడు రోహిత్ నాయుడు. ఇక ఆయన తర్వాతి స్థానం లో అమన్ మసూద్ కొనసాగుతుండగా, మూడవ స్థానం లో చరణ్, నాల్గవ స్థానం లో రాజకుమారి దయానా, 5 వ స్థానం లో మితిలేష్, ఆరవ స్థానం లో రామకృష్ణ/ షాలిని కొనసాగుతున్నారు. చూడాలి మరి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజున ఎలాంటి ట్విస్టులు లేకుండా టాప్ 6 కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది.