Homeఎంటర్టైన్మెంట్Irumudi Movie: 'ఇరుముడి' తర్వాత సరికొత్త ప్రయోగం చేయనున్న రవితేజ..వర్కౌట్ అవ్వకపోతే కష్టమే!

Irumudi Movie: ‘ఇరుముడి’ తర్వాత సరికొత్త ప్రయోగం చేయనున్న రవితేజ..వర్కౌట్ అవ్వకపోతే కష్టమే!

Irumudi Movie: ‘ఇరుముడి‘ సక్సెస్ తో మాస్ మహారాజ రవితేజ ఎలాంటి జోష్ తో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరు డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత, కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అన్నట్టు, ఈ సినిమాతో ఆయన బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. విడుదలకు ముందు ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని మాత్రం ఎవ్వరూ కలలో […]

Irumudi Movie:ఇరుముడిసక్సెస్ తో మాస్ మహారాజ రవితేజ ఎలాంటి జోష్ తో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరు డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత, కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అన్నట్టు, సినిమాతో ఆయన బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. విడుదలకు ముందు సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని మాత్రం ఎవ్వరూ కలలో కూడా ఊహించలేకపోయారు. పాన్ ఇండియన్ హీరోలుగా చెప్పుకొని తిరిగే ఎంతో మంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని రికార్డ్స్ ని రవితేజ చిత్రం తో ప్రతీ రోజు నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఏళ్ళ నుండి ట్రేడ్ ని గమనిస్తున్న విశ్లేషకులు కూడా సినిమా వసూళ్లను చూసి మెంటలెక్కిపోతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు, రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది.

ఇలాంటి హిట్ తర్వాత రవితేజ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే దానిపై అభిమానుల్లో కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. వాళ్ళ అంచనాలను మాత్రం తగ్గించుకుందా , చాలా భిన్నమైన స్టోరీ తోనే ఆయన ఈసారి మన ముందుకు రాబోతున్నాడు. చిత్రం లో రవితేజ తో పాటు శ్రీవిష్ణు కూడా మరో హీరో గా నటిస్తున్నాడు. ‘స్వాగ్వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన హషిత్ గోలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో శ్రీవిష్ణు కి జోడీగా ఎవరు నటించబోతున్నారు అనేది ఇంకా ఖరారు అవ్వలేదు కానీ, రవితేజ కి జోడీగా ఐశ్వర్య రాజేష్ నటించబోతున్నట్టు సమాచారం. ఆమె పాత్ర ఇది వరకు పోషించిన పాత్రలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుందట. అంతే కాదు రవితేజ క్యారెక్టర్ కూడా చాలా ప్రయోగాత్మకంగా ఉంటుందట. ఇప్పటి వరకు టాలీవుడ్ హిస్టరీ లో ఎవ్వరూ కూడా పాత్ర వెయ్యలేదని అంటున్నారు.

శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుకుంటున్న చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న ఆయన, పీక్ ఫార్మ్ లో ఉన్నటువంటి రవితేజ అదృష్టం కలిసి వస్తుందో లేదో చూడాలి. జనవరి 14 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దిల్ రాజు కి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. పైగా ఈసారి కూడా ఆయన ఎంటర్టైన్మెంట్ జానర్ తో రాబోతున్నాడు. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. ఇకపోతే చిత్రానికిదాగుడుమూతల దండాకోర్అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper