Bigg Boss 10 Telugu : ‘బిగ్ బాస్ 10’ హౌస్ ఆరంభం నుండే హీట్ ఎక్కింది. మొదటి ఎపిసోడ్ లోనే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు భారీ రేంజ్ లో జరిగాయి. ముఖ్యంగా కంటెంట్ మొత్తం త్రిగున్ , రోహిత్ చుట్టూనే తిరగడం గమనార్హం. త్రిగున్ ‘అగ్ని పరీక్ష 2’ షో ని చాలా గట్టిగా అనుసరించినట్టు ఉన్నాడు. అందుకే రోహిత్ ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి , సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అందరిలో అతని పై విషం నింపుతున్నట్టు చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించింది. అంతే కాదు , సెలబ్రిటీస్ లో అత్యధిక శాతం మంది కంటెస్టెంట్స్ కి మేము వేరు , ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ వేరు అనే ఫీలింగ్ ఉంది. ఉదాహరణకు రామ్ ప్రసాద్ తో దేబ్ జానీ మాట్లాడుతూ ‘నాకు గోల్డెన్ కీస్ ఇవ్వకపోవడం పై చాలా బాధగా ఉంది. కానీ మీరంతా కలిసి మన సెలబ్రిటీస్ కి గోల్డెన్ కీస్ ఇచ్చారు , అందుకు సంతోషంగా ఉంది ‘ అని చెప్పుకొచ్చింది.
కానీ ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ లో మాత్రం ఇలాంటి భావన ప్రస్తుతానికి అయితే లేదు. అయితే సెలబ్రిటీస్ లో ఇలా వేర్వేరు భావలు కలగడానికి ప్రధాన కారణం ‘త్రిగున్’. ప్రతీ ఒక్కరిని తన మాటలతో డామినేట్ చేస్తూ మాట్లాడనివ్వకపోవడం, రోహిత్ మీద పాత పగ ఉన్నవాడిలా వ్యవహరించడం వంటివి స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తోంది. ఇక అతనికి అండగా వర్షిణి కూడా నిలబడడం గమనార్హం. నిన్నటి ఎపిసోడ్ లో లీడర్స్ ని ఎంచుకోమని బిగ్ బాస్ చెప్పినప్పుడు, రోహిత్ కి ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ మాత్రమే ఓటు వేశారు, మీరంతా గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు అనే అర్థం వచ్చేలా మాట్లాడడం, అందుకు ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ అందరూ మండిపడడం వంటివి జరిగింది. రోహిత్, షాలిని , శ్రేష్టి, చరణ్ , అమన్ ల మధ్య జరిగిన సమ్బషణలు చూస్తే వీరిలో అలాంటి భావం అసలు లేదని అనిపించింది.
షాలిని అయితే సరైన లాజిక్స్ తో త్రిగున్ ని లాక్ చేసే ప్రయత్నం చేసింది. మేమంతా ‘అగ్ని పరీక్ష 2’ లో రోహిత్ ని చూశాము కాబట్టి, అతన్ని మా టీం లీడర్ గా ఎంచుకుంటే, మేము హౌస్ మేట్స్ అవుతాము అనే స్వార్థం తో , అతన్ని లీడర్ గా ఎంచుకున్నాము, మీరంతా ఎలా ఆడుతారో మాకు తెలియదు కాబట్టి రిస్క్ చేయలేదు అని చెప్పి, త్రిగున్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. కానీ త్రిగున్ మాత్రం కంట్రోల్ అవ్వడం లేదు, అతని నోటి ని ఎవ్వరూ అదుపు చేయలేకపోయారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత త్రిగున్ కేవలం నిద్ర పోయేటప్పుడు మాత్రమే సైలెంట్ గా ఉన్నాడు. మిగిలిన సమయం మొత్తం మాట్లాడుతూనే ఉన్నాడు.
ఇది నిజంగా అతని స్వభావం అంతే అనుకోవాలా?, లేదా స్క్రీన్ స్పేస్ కోసం కావాలని చేస్తున్నాడా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. కానీ ప్రస్తుతానికి అయితే, త్రిగున్ తమ పై చాలా డామినేషన్ చూపిస్తున్నాడు అనే భావన సెలబ్రిటీస్ లో కూడా ఉంది. ఒక్క సుధీర్ మాత్రమే ఈ విషయాన్ని గ్రహించి తన తోటి కంటెస్టెంట్స్ తో అంటాడు. కానీ త్రిగున్ ఏ మాయ చేసాడో ఏమో తెలియదు కానీ, అతను కూడా చివరికి త్రిగున్ వైపే నిలుస్తాడు. ఇదంతా పక్కన పెడితే , రోహిత్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. త్రిగున్ కి ఒక పక్క దీటుగా కౌంటర్లు ఇస్తూనే, లిమిట్స్ ని దాటకుండా జాగ్రత్త పడ్డాడు. త్రిగున్ చెప్పిన మాటలను విని కృష్ణుడు రోహిత్ పై లేని కోపాన్ని కొని తెచ్చుకొని , అతనిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. వాస్తవానికి చెప్పాలంటే కృష్ణుడు కారణంగానే రోహిత్ మొదటి టాస్క్ లో ఓడిపోతాడు.
అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ రోహిత్ టాస్క్ లో తనపై డామినేషన్ ని చూపించినట్టు, నీలో అసలు లీడర్ షిప్ క్వాలిటీస్ లేవంటూ, నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నావా అంటూ కృష్ణుడు నోరేసుకొని రోహిత్ మీద పడిపోవడాన్ని చూసి ఆడియన్స్ షాక్ కి గురయ్యారు. ఎందుకో ఈయన గత సీజన్ లో సుమన్ ని అనుసరిస్తున్న ఫీలింగ్ కలిగింది. కానీ కృష్ణుడు ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నప్పుడు, రోహిత్ తన ఎమోషన్స్ మీద కంట్రోల్ చూపించడం చాలా ఆసక్తికరంగా మారింది. కృష్ణుడు సీనియర్ నటుడు అనే కారణం వల్లనో, లేదా అతని పై ఉన్నటువంటి గౌరవం వల్లనో తెలియదు కానీ, రోహిత్ కృష్ణుడు మాట్లాడుతున్నంతసేపు మౌనం గా నవ్వుతూ అలా చూస్తుండిపోయాడు.
ఓవరాల్ గా మంచో చెడో, హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఒక రేంజ్ లో కంటెంట్ ఇస్తున్న కంటెస్టెంట్ గా త్రిగున్ నిల్చిపోయాడు. ఇతన్ని బాగా గమనిస్తే, ఇతనిలో సంజన + రేవంత్ కనిపిస్తున్నారు. కానీ ఇది రాబోయే రోజుల్లో త్రిగున్ ని బాగా నెగెటివ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతీ దాంట్లో దూరిపోవడం మంచిది కాదు, త్రిగున్ కి ఇది రాబోయే రోజుల్లో అర్థం అవుతుంది అనిపిస్తోంది. ఓవరాల్ గా అయితే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ మొత్తాన్ని అగ్ని పరీక్ష 2 కంటెస్టెంట్స్ కి వ్యతిరేకం గా మార్చడం లో త్రిగున్ సక్సెస్ అయ్యాడు. ఇక రాబోయే రోజుల్లో దీని పరిణామాలు ఏంటో చూడాలి. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ 10 మంది కంటెస్టెంట్స్ కి ఇచ్చిన పవర్స్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ పవర్స్ కారణంగా ఈ వారం ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాంటి ట్విస్టులకు అవసరమయ్యే పవర్స్ ని ఆ 10 మంది కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు బిగ్ బాస్. మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ వారం బిగ్ బాస్ నుండి ఎవరెవరు వెళ్తారని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రయిబ్