Bigg Boss Agnipariksha 2: రీసెంట్ గానే మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ కి ఆడియన్స్ లో ఎలాంటి బజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పాజిటివ్ యాంగిల్ అయినా, నెగెటివ్ యాంగిల్ అయినా ఈ షో నుండి ఏ అంశం బయటకు వచ్చినా ఒక రేంజ్ లో వైరల్ అయిపోతున్నాయి. మొదటి సీజన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ , ఈ రేంజ్ రెస్పాన్స్ మాత్రం రాలేదు. ‘అగ్నిపరీక్ష 2’ లో ప్రస్తుతం ఉన్నటువంటి టాప్ 13 కంటెస్టెంట్స్ లో ఎవరిని లోపలకు పంపాలో జడ్జీలకు కూడా చాలా కఠినమైన పరీక్ష గా మారింది. ఇకపోతే ఈ షో లో ఆడిషన్స్ సమయం లోనే జడ్జీలను విశేషంగా ఆకర్షించి , మూడు గ్రీన్ ఫ్లాగ్స్ ని సొంత చేసుకొని టాప్ 15 లోకి నేరుగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ , మితిలేష్ వంటి వారు ఆశించిన స్థాయిలో గేమ్స్ ఆడడం లేదని , వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం కష్టమే అని అంతా అనుకున్నారు.
కానీ కట్ చేస్తే నేటి ఎపిసోడ్ లో వీళ్లిద్దరు దుమ్ము లేపేశారు అని చెప్పొచ్చు. వీళ్ళతో పాటు దీపక్, హేమంత్ , షాలిని వంటి కంటెస్టెంట్స్ కి కూడా ఈ ఎపిసోడ్ మంచి మైలేజ్ ఇచ్చింది. నేటి ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత SKN విచ్చేశాడు. ఆయన సమక్షం లో ఒక చిన్న ఆడిషన్ జరిగింది. అపూర్వ SKN తో మాట్లాడుతూ ‘నాకు , శ్రేష్టి కి మీ తదుపరి సినిమాలో అవకాశం ఇస్తారా?’ అని అడుగుతుంది. నేను అవకాశం ఇవ్వాలంటే మీరు ఎలా నటిస్తారో తెలియాలి , మీ పెర్ఫార్మన్స్ ని చూసిన తర్వాత నిర్ణయించుకుంటాను అని అంటాడు SKN. అప్పుడు శ్రీముఖి శ్రేష్టి , అపూర్వ , చరణ్ లను స్టేజి మీదకు పిలిచి, ట్రైయాంగిల్ లవ్ స్టోరీ చేయమని అంటుంది.
ఒక పక్క శ్రేష్టి, మరో పక్క అపూర్వ, మధ్యలో చరణ్, వీళ్లిద్దరూ చరణ్ కోసం కొట్టుకోవడం చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది. ఇక చివర్లో వెళ్ళేటప్పుడు SKN మాట్లాడుతూ మీ రెండు టీమ్స్ నుండి కచ్చితంగా ఎవరినో ఒకరిని నా తదుపరి సినిమాలో తీసుకుంటాను అని హామీ ఇచ్చాడు. మరి నిజంగానే ఆయన తన సినిమాలో వీళ్లకు అవకాశం ఇస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఎంతో ఉత్కంఠ మధ్య నడిచిన ‘అగ్ని పరీక్ష 2’ షూటింగ్ నేటితో ముగియనుంది. ఈ షో నుండి ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ లాంచ్ రోజున హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న టాప్ 6 కంటెస్టెంట్స్ ఎవరో చూడాలి.