Homeఎంటర్టైన్మెంట్Aadarsa Kutumbam: వాయిదాపడ్డ 'ఆదర్శ కుటుంబం'.. కొత్త విడుదల తేదీ విషయం లో అసంతృప్తి వ్యక్తం...

Aadarsa Kutumbam: వాయిదాపడ్డ ‘ఆదర్శ కుటుంబం’.. కొత్త విడుదల తేదీ విషయం లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్!

Aadarsa Kutumbam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరో గా నటిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మార్కెట్ లో బజ్ మామూలు రేంజ్ లో లేదు. కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందనే నమ్మకం తో ఉన్నారు ప్రతీ ఒక్కరు. రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ వీడియోస్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. […]

Aadarsa Kutumbam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరో గా నటిస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై మార్కెట్ లో బజ్ మామూలు రేంజ్ లో లేదు. కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందనే నమ్మకం తో ఉన్నారు ప్రతీ ఒక్కరు. రీసెంట్ గా విడుదల చేసిన గ్లింప్స్ వీడియోస్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గ్లింప్స్ వీడియోస్ ప్రతీ ఫ్రేమ్ లోనూ కనిపించింది. అంతే కాకుండా అక్టోబర్ 2 లాంటి మంచి రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేయడం తో ఓపెనింగ్స్ కూడా వేరే లెవెల్ లో ఉంటాయని అనుకున్నారు. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 2 న విడుదల అవ్వడం దాదాపుగా అసాధ్యమని అంటున్నారు.

కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పర్ఫెక్షన్ కోసం ఒక 10 రోజులు , లేదా రెండు వారాలు వాయిదా వెయ్యాలని చూస్తున్నారట. అక్టోబర్ 9 లేదా 16 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రానుంది. అయితే అక్టోబర్ 11 న సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని అక్టోబర్ 9 న విడుదల చేస్తే, కచ్చితంగా ‘జైలర్ 2’ మేనియా ప్రభావం పడుతుందని, ఓపెనింగ్స్ వరకు గట్టిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ, ఫుల్ రన్ లో ‘జైలర్ 2’ కి టాక్ వస్తే మాత్రం ‘ఆదర్శ కుటుంబం’ కి కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

మరోపక్క చిరంజీవి విశ్వంభర, విజయ దేవరకొండ ‘రణబలి’ చిత్రాలు కూడా ఇదే సీజన్ లో విడుదల కాబోతున్నాయి. ఇంతటి టైట్ షెడ్యూల్ మధ్య ‘ఆదర్శ కుటుంబం’ విడుదలై పొరపాటున పాజిటివ్ టాక్ రాకపోతే భారీ నష్టాలను ఎదురుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈయన సినిమాలు చెప్పిన తేదికి ఒక్కటి కూడా విడుదల అవ్వలేదు. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ కి కూడా అదే పరిస్థితి ఎదురవ్వడం గమనించాల్సిన విషయం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా బజ్ ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper