Bigg Boss Agnipariksha 2: రీసెంట్ గానే మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ కి ఆడియన్స్ నుండి ఎలాంటి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందో కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఎక్కువగా వివాదాలకు ఈ షో కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది కానీ, ఎపిసోడ్స్ లో ఫుల్ ఫైర్ కంటెంట్ ఉండడం తో మంచి వ్యూయర్ షిప్ లభిస్తోంది. ఇక ఈ షో కి సంబంధించిన షూటింగ్ పూర్తి అవ్వడానికి మరో రెండు రోజుల సమయం ఉంది. అయితే టాప్ 15 కంటెస్టెంట్స్ కి ఇప్పటికే ఓటింగ్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. వీరిలో గాయత్రీ ఎలిమినేట్ అయ్యారు. నేటి ఎపిసోడ్ లో ఈమెకు ఒక ఎల్లో కార్డు వచ్చింది, రాబోయే రోజుల్లో జడ్జీలు కూడా ఈమెకు ఒక ఎల్లో కార్డు ఇవ్వడం వల్ల ఎలిమినేట్ అయ్యింది. కానీ ఆ ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు కాబట్టి , జియో హాట్ స్టార్ లో ఈమె ఇంకా ఓటింగ్ లైన్ లో కనిపిస్తుంది.
ఆమెకు ఎవరైనా ఓట్లు వేస్తే వృధా అయ్యినట్టే. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే , భాగీ తుళ్లూరు కూడా ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యినట్టు సమాచారం. టాప్ 15 లోకి అడుగుపెట్టేందుకు బేబీ కట్ చేయించుకున్న భాగీ , మరో రెండు రోజుల్లో షూటింగ్ పూర్తి అయ్యే సమయంలో ఎలిమినేట్ అవ్వడం బాధాకరం. చాలా చలాకీతనం తో, హుషారైన మాటలతో అందరినీ ఆకర్షించే భాగీ, మొట్టమొదటిసారి బాగా ఎమోషనల్ అయిపోయింది అట. వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిందట. షో కోసం జుట్టు కత్తిరించుకున్నాను, టాస్కులు వచ్చినప్పుడు నావైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇచ్చాను, అయినప్పటికీ ఎలిమినేట్ అయ్యాను, మరో రెండు రోజుల షూటింగ్ పూర్తి అయ్యుంటే , ‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో కనిపించేదాన్ని కదా అని ఆమె మనసులో బాధ పడి ఉండొచ్చు.
నెల్లూరు యాసతో, మంచి కామెడీ టైమింగ్ తో అలరించిన భాగీ తుళ్లూరు ని ఇక మనం ‘బిగ్ బాస్ 10’ లో చూడలేం. ఆమెకు ఓట్లు వేసే వాళ్ళు , మీ ఓటు ని వృధా చేసుకోకండి. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేందుకు మరో వారం రోజుల సమయం పట్టొచ్చు. ఇక చివరికి 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. చివరి రెండు రోజుల షూటింగ్ లో టాప్ 10 మాత్రమే మిగలొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం అయితే చరణ్ కి ఓటింగ్ భారీ రేంజ్ లోనే పడుతుంది కానీ , పెద్దగా పర్ఫార్మ్ చేయకపోవడం వల్ల , జడ్జీలు ఎప్పుడైనా ఇతన్ని ఆపేసే ప్రమాదం ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.