Bigg Boss Agnipariksha 2: భారీ అంచనాల నడుమ మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ ప్రోగ్రాం మరో వారం రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు ప్రసారమైన ఎపిసోడ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు చాకులు లాగా ఉన్నారు , పాపం ఈసారి బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీస్ పరిస్థితి ఏంటో అని విశ్లేషకులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఆదివారం ‘బిగ్ బాస్ 10’ షో గ్రాండ్ గా లాంచ్ కానుంది. అయితే గత సీజన్ లో లాగా కాకుండా ఈ సీజన్ లో ప్రతీ ఒక్కరిని ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే బిగ్ బాస్ హౌస్ లోకి పంపే ప్రక్రియ ని ఆలోచిస్తున్నారు మేకర్స్. గత సీజన్ లో ముగ్గురు కంటెస్టెంట్స్ ని ఆడియన్స్ ఓటింగ్ ద్వారా హౌస్ లోపలకు పంపితే, మరో ముగ్గురిని ‘అగ్ని పరీక్ష’ జడ్జీల సెలక్షన్ ద్వారా పంపారు. కానీ ఈసారి ఆ అవకాశాలు తక్కువే. ఇదంతా పక్కన పెడితే నేటి ఎపిసోడ్ కూడా మంచి రసవత్తరంగా మారింది.
అయితే ఈ ఎపిసోడ్ లో జరిగిన ఒక సంఘటన మాత్రం ఆడియన్స్ కి చిరాకు కలిగించింది. అది చూసిన తర్వాత నెటిజెన్స్ వీళ్ళు ఇక్కడి నుండే మొదలు పెట్టారు రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ రియాలిటీ షో లో లవ్ ట్రాకులు ప్రతీ సీజన్ లో సర్వ సాధారణమే. కొన్ని లవ్ ట్రాక్స్ స్క్రిప్టెడ్ గా ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా ఉంటారు. కానీ కొంతమంది లవ్ ట్రాక్స్ మాత్రం నిజాయితీగా ఉంటాయి. కానీ ఇప్పుడు లవ్ ట్రాక్స్ మొత్తం చూసే ఆడియన్స్ కి చాలా చిరాకు కలిగిస్తోంది. ఇంతకు ముందు ;బిగ్ బాస్’ వరకు మాత్రమే పరిమితమైన ఈ లవ్ ట్రాక్స్, ఇప్పుడు ‘అగ్ని పరీక్ష 2’ వరకు చేరింది. నిన్న మొన్నటి వరకు పూర్తి స్థాయి ఇంటెన్సిటీ తో సాగిన ‘అగ్ని పరీక్ష 2’ ఎపిసోడ్స్, నేటి ఎపిసోడ్ లో లవ్ ట్రాక్ వైపు యూ టర్న్ తీసుకుంది.
నేటి ఎపిసోడ్ కి ‘బిగ్ బాస్ 5’ టైటిల్ విన్నర్ ‘వీజే సన్నీ’ ముఖ్య అతిథిగా విచ్చేసి కంటెస్టెంట్స్ కి కొన్ని టాస్కులు నిర్వహిస్తాడు. ఆ సమయం లోనే షాలిని, అమన్ ల లవ్ ట్రాక్ బయటపడుతుంది. సన్నీ , షాలిని కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు అమన్ ‘అది నా పిల్ల రా’ అని అనడం, అందుకు సన్నీ ‘ఏంటి నువ్వు వాడి పిల్లవా’ అని షాలిని ని అడగ్గా, ఆమె సిగ్గు పడుతూ ‘నేను కేవలం అభిజిత్ పిల్లని మాత్రమే. ఆయనే నాకు కావాలి’ అంటూ వెళ్లిపోవడం వంటివి ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచాయి. గత సీజన్ లో డిమోన్ పవన్ అద్భుతంగా గేమ్స్ ఆడినప్పటికీ, టాప్ 3 కి పరిమితం అవ్వడానికి ప్రధాన కారణం రీతూ చౌదరి తో ఆయన నడిపిన లవ్ ట్రాక్. ఇప్పుడు అమన్ కూడా మంచి పెర్ఫార్మన్స్ తో ‘అగ్నిపరీక్ష 2’ లో కొనసాగుతున్నాడు. కానీ ఆయన లోపలకు వెళ్లిన తర్వాత లవ్ ట్రాక్స్ నడిపితే మాత్రం ఇక టైటిల్ ని మర్చిపోవడమే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram