Bigg Boss Agnipariksha 2: రీసెంట్ గా భారీ బజ్ తో మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ షో ఇప్పుడు చివరి దశకు చేరింది. వచ్చే వారం శనివారం తో ఈ షో కి సంబంధించిన చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి ప్రతీ ఎపిసోడ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు టీవీ టెలికాస్ట్ లోనూ, ఇటు హాట్ స్టార్ లోనూ అద్భుతమైన వ్యూస్ వచ్చాయి. పైగా ఈ ఎపిసోడ్ లో జరిగిన కొన్ని సంఘటనలు సోషల్ మీడియా లో తీవ్రమైన విమర్శలకు దారి తీశాయి. ఒక విధంగా చెప్పాలంటే, ఆ వివాదాలే ఈ షో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అయ్యాయి అని చెప్పొచ్చు. ఇకపోతే నేటి ఎపిసోడ్ లో టాప్ 15 లో ఉన్నటువంటి గాయత్రీ ఎలిమినేట్ అయ్యింది.
ఈమెపై తీవ్రమైన విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈమె తన మొదటి టాస్కు నే ఆడకుండా వదిలేసిందని, అలాంటి ఆమెని టాప్ 15 కి పంపించి, అద్భుతంగా ఆడినటువంటి ఎంతో మంది సామాన్యులను రిజెక్ట్ చేసి వాళ్లకు అన్యాయం చేసారంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున మండిపడ్డారు నెటిజెన్స్. జడ్జీలు గాయత్రీ ని కావాలని ముందుకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, రికమండేషన్ తో వచ్చింది కాబట్టి , ఈమె కచ్చితంగా బిగ్ బాస్ 10 లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా లో కొన్ని కథనాలు చక్కర్లు కొట్టాయి. కానీ టాప్ 15 లోకి ఆమెని పంపనైతే పంపారు కానీ , ప్రతీ సారీ టాస్కులు ఆమెని ఆదినివ్వకుండా చేస్తూ వచ్చారు కంటెస్టెంట్స్. మొదటి టాస్కు ని వదిలేయడం ఈమెకు చాలా పెద్ద మైనస్ అయ్యింది.
అప్పటి నుండి ఆమె తోటి కంటెస్టెంట్స్ ఈ ఒక్క కారణాన్ని ఎత్తి చూపుతూ గాయత్రీ ఈ గేమ్ కి పనికిరాదని పక్కకి నెడుతూ వచ్చారు. దీంతో ఆమె టాలెంట్ పెద్దగా హైలైట్ అవ్వలేదు. ఇక నేటి ఎపిసోడ్ దురదృష్టం కొద్దీ టాస్క్ కూడా ఓడిపోయింది. దీంతో జడ్జీలు రామకృష్ణ, గాయత్రీ లలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి అని మిగిలిన కంటెస్టెంట్స్ కి చెప్పడంతో వాళ్ళు అత్యధిక శాతం గాయత్రీ పేరు చెప్పి ఆమెని ఈ షో నుండి ఎలిమినేట్ చేశారు. అయితే ఎలిమినేట్ అయ్యాక గాయత్రీ బాగా ఎమోషనల్ అవుతుందేమో అని అంతా అనుకున్నారు.
కానీ ఆమె చాలా ధైర్యం గా మాట్లాడడం అందరినీ ఆకర్షించింది. ఆమె మాట్లాడుతూ ‘ఇదే నా కెరీర్ కాదు, ఒక అవకాశం వచ్చింది, నిరూపించుకోలేకపోయాను, వేరే అవకాశం కోసం ప్రయత్నం చేస్తాను. ఈరోజు నన్ను ఎలిమినేట్ చేయడానికి చాలా మంది ఓట్లు వేశారు. నేను ఇది ముందుగానే ఊహించాను, వాళ్ళ మీద నాకు ఎలాంటి కోపం లేదు. కానీ అందరిలో నేను వీక్ గా ఉన్నాననే విషయాన్ని , పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. నేను అందుకు బాగా ఏడ్చేసి , చాలా సింపతీ డ్రామా చేయొచ్చు, కానీ నేను నిజాయితీ గా ఉండాలని అనుకున్నాను, అలాగే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు విన్నాక , చాలా మంచి అమ్మాయి, తల్లిదండ్రులు మంచి విలువలతో పెంచారు. ఈ అమ్మాయిని ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నాము అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.