Bigg Boss Agnipariksha 2: రీసెంట్ గానే గ్రాండ్ గా మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ ప్రోగ్రాం కి సంబంధించిన గ్రాండ్ ఫినాలే షూటింగ్ రీసెంట్ గానే ముగిసింది. ఈ షో లో ఇప్పటి వరకు ప్రతీ కంటెస్టెంట్ తన వైపు నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. జడ్జీలకు కూడా ఎంపిక ప్రక్రియ కష్టమయ్యేట్టు చేశారు. అయితే ఇప్పటి వరకు పెట్టిన టాస్కులన్నీ గమనిస్తే గాయత్రి, భాగీ, ప్రియాంక మరియు అపూర్వ వంటి వారు పెద్దగా పెర్ఫార్మన్స్ ఇవ్వలేదనే చెప్పాలి. వీరిలో ఇప్పటికే గాయత్రి , భాగీ వంటి వారు ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన ఇద్దరు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ప్రస్తుతానికి చాలా కష్టమే, వీళ్లకు ఆడియన్స్ ఓటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు జరిగిన టాస్కుల్లో బాగా షైన్ అయినటువంటి కంటెస్టెంస్ట్ రోహిత్ , అమన్, దీపక్ , హేమంత్, షాలిని , ఝాన్సీ, రాజకుమారి దయానా మాత్రమే.
వీరిలో రోహిత్ కి ఆడియన్స్ ఓటింగ్ కనీవినీ ఎరుగని రేంజ్ లో పడుతోంది. ఈయనకు దరిదాపుల్లో మరో కంటెస్టెంట్ లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇతను కచ్చితంగా ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇస్తాడు , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ ఫినాలే రోజున కంటెస్టెంట్స్ కి మధ్య కొన్ని పోటీలు నిర్వహించారు అట. ఈ పోటీల్లో అత్యధిక శాతం గెలిచిన ఒక కంటెస్టెంట్ ని నేరుగా ‘బిగ్ బాస్ 10’ కి పంపిస్తామని జడ్జీలు బంపర్ ఆఫర్ ఇచ్చారట. ఝాన్సీ అత్యధిక శాతం టాస్కులు గెలవడంతో , ఆమెని నేరుగా ‘బిగ్ బాస్ 10’ కి పంపినట్టు తెలుస్తోంది. ఝాన్సీ కి ఓట్లు వేసేవాళ్ళు , ఇక మీ వోటుని వృధా చేసుకోకండి. ఆమె నేరుగా ‘బిగ్ బాస్ 10’ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.
‘బిగ్ బాస్ 10’ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజున మొత్తం మీద 6 మంది సామాన్యులను హౌస్ లోకి పంపిస్తారు. ఆ ఆరు మందిలో ఇప్పటికే ఒకరు ఖరారు అయ్యారు. ఇక మిగిలిన వారిలో కచ్చితంగా రోహిత్ , అమన్, రాజా కుమారి దయానా ఉంటారు. ఇక మిగిలిన ఇద్దరిలో జడ్జీలు తమ ఛాయస్ ద్వారా ఎవరిని లోపలకు పంపబోతున్నారు అనేది తెలియాలంటే సెప్టెంబర్ 6 వరకు ఆగాల్సిందే. మితిలేష్ , చరణ్ లలో ఎవరో ఒక్కరు మాత్రమే హౌస్ లోకి అడుగుపెడతారు. అదే విరంగా శ్రేష్టి వ్యాకరణం, షాలిని లలో కేవలం ఒక్కరికి మాత్రమే ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ 6 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత , గత సీజన్ లో లాగానే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఇద్దరు సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించబోతున్నారు అట మేకర్స్.