Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: ఏపీలో సంచలన సర్వే.. వైసీపీ కి ఓటు బ్యాంకు పెరిగిందా..పవన్, లోకేష్ పరిస్థితి...

AP Politics: ఏపీలో సంచలన సర్వే.. వైసీపీ కి ఓటు బ్యాంకు పెరిగిందా..పవన్, లోకేష్ పరిస్థితి ఏంటంటే..

AP Politics: ఏపీలో స్థానిక ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. సీట్ల సర్దుబాటు.. ఇతర వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. సహజంగా కూటమిలో పోటీ అధికంగా ఉంది. వైసీపీలో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని వాదనలు ఉన్నాయి. ఇలా సాగుతున్న రాజకీయ వ్యవహారంలో చాణక్య సంస్థ సర్వే నిర్వహించింది. 4.37 శాతం ఓటు షేర్ కోల్పోయింది ఈ సర్వే ప్రకారం 2024 తర్వాత 4.37 ఓట్ షేర్ ను వైసిపి కోల్పోయింది.. […]

AP Politics: ఏపీలో స్థానిక ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. సీట్ల సర్దుబాటు.. ఇతర వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. సహజంగా కూటమిలో పోటీ అధికంగా ఉంది. వైసీపీలో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని వాదనలు ఉన్నాయి. ఇలా సాగుతున్న రాజకీయ వ్యవహారంలో చాణక్య సంస్థ సర్వే నిర్వహించింది.

4.37 శాతం ఓటు షేర్ కోల్పోయింది

ఈ సర్వే ప్రకారం 2024 తర్వాత 4.37 ఓట్ షేర్ ను వైసిపి కోల్పోయింది.. టిడిపి తో పోల్చితే దాదాపు 11.90 శాతం తేడా ఓటు బ్యాంకు కనిపిస్తోంది. ఎమ్మెల్యేలలో లోకేష్ టాప్ లో ఉన్నారు. 175 నియోజకవర్గాలలో 52, 500 మంది ఓటర్లను పరిశీలించారు. రెండు నెలలపాటు సర్వే నిర్వహించారు. అయితే కూటమి బలం తగ్గడం కాదు కదా.. భారీగా పెరిగింది.

2024లో జరిగిన ఎన్నికలతో పోల్చి చూస్తే

2024 లో జరిగిన ఎన్నికలతో పోల్చి చూస్తే చాణక్య సర్వే చెప్పిన దాని ప్రకారం చూస్తే.. టిడిపి ఓటు బ్యాంకు 45. 60% నుంచి 46.90 శాతానికి పెరిగింది. మొత్తంగా ఓటు బ్యాంకు 1.30 శాతానికి పెరిగింది. వైసీపీకి 2024 ఎన్నికల్లో 39.37 ఓటు బ్యాంకు లభించింది. ఇప్పటికి అది 35% పడిపోయింది. జనసేనకు నాడు ఓటు బ్యాంకు 8.53 శాతం గా ఉంది. ఇప్పుడు అది తొమ్మిది శాతానికి చేరుకుంది. మొత్తంగా 0.47 ఓటు శాతం పెరిగింది. బిజెపికి 2.83 శాతం ఉండగా.. ఇప్పుడు అది 3.5 జీరోకి జరిగింది. మొత్తంగా 0.67 శాతం ఓటు బ్యాంకు పెరిగింది. ఇక ఇతరులు 3.67 నుంచి 5.60 వరకు శాతాన్ని పెంచుకున్నారు.

ఓటు షేర్ పెరిగింది

మొత్తంగా మూడు పార్టీల ఓటు షేర్ దాదాపు 57% నుంచి 59.4 శాతానికి చేరుకుంది. అధికారులకు వచ్చిన తర్వాత ఓటు బదిలీ మరింత బలపడింది. 4.37 పాయింట్ల ఫలితమే ఈ సర్వేలో అతిపెద్ద మార్పు. ఓటు షేర్ 35% పడిపోయింది. రఫ్పా రఫ్పా నినాదాలు మాత్రమే చెబుతున్న వైసిపి నాయకులు.. ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య ఎదురయిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా పకడ్బందీగా వ్యవహరించకపోతే 35 శాతం ఓటు బ్యాంక్ కూడా తగ్గిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ గణాంకాలు చూస్తే వైసిపి కోల్పోవడం కష్టంగానే కనిపిస్తోంది.

ఇతరుల వైపు వెళ్లింది

వైసిపి కోల్పోయిన ఓట్లలో కొంత భాగం ఇతరుల వైపు వెళ్ళింది. అటు కూటమి.. ఇటు వైసీపీ మీద అసంతృప్తితో ఉన్నవారు కాంగ్రెస్ లాంటి ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఎమ్మెల్యేలలో లోకేష్.. కోటం.. పవన్ కళ్యాణ్ వరుసగా టాప్ మూడు స్థానాలలో ఉన్నారు. ఇక వైసిపి ఎమ్మెల్యేలలో చివరికి జగన్ తో ఎవరూ పెద్దగా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత మాత్రమే జగన్ పులివెందులలో హడావిడి చేస్తున్నారని.. ఆ తర్వాత జనాల బాధలను పట్టించుకునేవారు లేరని సర్వేలో తేలింది.

లోకేష్, పవన్ పరిస్థితి ఏంటంటే..

మంత్రులుగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ పిఠాపురం విషయంలో.. లోకేష్ మంగళగిరి విషయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు అయితే కుప్పం విషయంలో వారానికి రెండు రోజులు సమయం కేటాయిస్తున్నారని.. ముఖ్యమంత్రిగా ప్రతిరోజు కుప్పం వెళ్లడం సాధ్యం కాదు కాబట్టి.. ఆయన నియమించుకున్న ప్రతినిధుల ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం విషయంలో చంద్రబాబు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. అందువల్లే ఆయన పనితీరు కూడా అద్భుతంగా ఉందని ఈ సర్వేలో తేలింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper