Irumudi Opening Collections: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై , మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కళ్లుచెదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 32 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది. రవితేజ లాంటి పెద్ద హీరో కి , సరైన సూపర్ హిట్ పడితే ఎలా ఉంటుందో ప్రతీ సెంటర్ లో ఈ చిత్రానికి నమోదు అవుతున్న గ్రాస్ వసూళ్లను చూస్తే అర్థం అవుతోంది. ఇకపోతే ఈ చిత్రం థియేటర్స్ లో సంబరాలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
ముఖ్యంగా ‘మల్లెపూల పల్లకి’ పాటకు ప్రేక్షకులు థియేటర్స్ లో సీట్ల మీద కూర్చోలేదు. స్క్రీన్స్ ముందుకు వచ్చి హారతులు పడుతూ చిందులు వేశారు. స్క్రీన్ మీదకు పేపర్స్ కి బదులుగా బంతి పూలను విసిరారు. ఇలాంటి హంగామా ఈమధ్య కాలం లో ఏ సినిమాకు కూడా జరగలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సంబరాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఈ వీడియోలే కనిపిస్తున్నాయి. రవితేజ లాంటి పెద్ద హీరో , దేవుడి బ్యాక్ డ్రాప్ తో సినిమా తీస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఆగుతారా చెప్పండి?, ఈ చిత్రానికి కూడా అదే జరిగింది. మ్యాట్నీ షోస్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కళకళలాడిపోతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్టు ఉంటే , ఏ సినిమా వసూళ్లు అయినా ఊహించని రేంజ్ లో ఉంటుంది. లాంగ్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేరు.
ఈ సినిమాకు కూడా రాబోయే రోజుల్లో అదే జరగనుంది. రేపటి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నయి. కేవలం 20 కోట్ల రూపాయిల రేంజ్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, రేపు మ్యాట్నీ షోస్ తోనే పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టనుంది. ఇక రేపు ఫస్ట్ షోస్ తర్వాత ఈ చిత్రానికి వచ్చే ప్రతీ పైసా లాభమే. ఫుల్ రన్ 100 కోట్ల గ్రాస్ వసూళ్లు కచ్చితంగా వస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు, మరి 150 కోట్ల గ్రాస్ రేంజ్ కి ఈ చిత్రం రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి.