Flydubai flight incident: యునైటెడ్ అరబ్ ఎమైరేట్స్ లోని దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ లోని టెల్ అవీవ్ ప్రాంతానికి ఫ్లై దుబాయ్ సంస్థకు సంబంధించిన విమానం వస్తోంది. 33 వేల అడుగుల ఎత్తు నుంచి వెళ్తోంది. విమానం ప్రయాణిస్తున్న క్రమంలో ఒక్కసారిగా కలకలం నెలకొంది. కాల్ పీట్ ప్రాంతంలో పైలట్ల మధ్య ఘర్షణ జరిగింది. గట్టిగా అరుపులు వినిపించాయి. ఈ ఘటనలో కో పైలెట్ కత్తితో పైలట్ ను పొడిచారు. విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
విమానం తలకిందులుగా
ఈ ఘటనలో విమానం తలకిందులుగా పడిపోవడం మొదలైంది. ప్రయాణికులు సీట్లును గట్టిగా పట్టుకున్నారు. ఒకటి కేకలు పెట్టారు. విమానం హైజాక్ అయిందని సంకేతాలు వినిపించాయి. గతంలో అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగినట్టుగానే ఇక్కడ కూడా దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రయాణికులలో ఆందోళన మొదలైంది.
ఒక్కసారిగా అలర్ట్ అయింది
ఈ ఘటనతో ఇజ్రాయిల్ దేశం ఒక్కసారిగా అలర్ట్ అయింది. యుద్ధ విమానాలను వెంటనే పంపించింది. మరోవైపు విమానం పడిపోతున్న క్రమంలో కాక్ పిట్ లోకి సిబ్బంది పరుగులు పెట్టారు. కో పైలట్ ను అడ్డగించారు. అతడిని బంధించారు. ప్రధానమైన పైలెట్.. ఇతర సిబ్బంది విమానాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత విమానం అసాధారణంగా గాలిలో తిరిగింది. అనంతరం సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే ఈ విమానాన్ని కూల్చి వేయడానికి ప్రయత్నించిన కో పైలట్ ఒమన్ దేశానికి చెందిన వాడని గుర్తించారు.
మన భారతీయుడు
ఫ్లై దుబాయ్ ఘటనలో విమానాన్ని.. ప్రయాణికులను కాపాడిన ఆ వ్యక్తి ఎవరో కాదు మన భారతీయుడు. అతను పైలట్ గా పనిచేస్తున్నాడు. అతని పేరు స్మిత్ మచ్చర్.. కో పైలట్ కత్తితో పొడిచి ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తుంటే.. స్మిత్ మాత్రం తట్టుకొని నిలబడ్డాడు. ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడాడు. స్మిత్ 2022లో జూన్ నెలలో ఫ్లై దుబాయ్ సంస్థలో పైలట్ గా చేరాడు. ఇతనికి 9500 గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం మంది. బోయింగ్ 737 పైలెట్లకు శిక్షణ కూడా ఇచ్చాడు. ఫ్లై దుబాయ్ సంస్థ మాత్రం పైలట్, కో పైలెట్ వివరాలను అధికారికంగా చెప్పకపోవడం విశేషం. అయితే ఈ ఘటనలు గాయపడిన స్మిత్ కు సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇతని ఆరోగ్యం ప్రస్తుతం ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్మిత్ స్వస్థలం గుజరాత్ అని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అంతర్జాతీయ మీడియాలో కథనాలు
స్మిత్ కు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం అధికంగా జరిగింది. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ.. డిశ్చార్జ్ అవ్వడానికి ఇంకా సమయం పడుతుందని తెలుస్తోంది. కాగా, స్మిత్ చేసిన సాహసం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యూహూ అభినందించారు. అతడిని సూపర్ హీరో అంటూ కొనియాడారు. అతడు 174 మంది ప్రాణాలు కాపాడటం మామూలు విషయం కాదని.. అతడు గొప్ప పని చేశాడని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.