Bigg Boss Telugu 10: బుల్లితెర వీక్షకులకు కావలసిన స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ను అందిస్తోంది రియాల్టీ షో బిగ్ బాస్. ఈ షో ప్రారంభమైన దగ్గరనుంచి ముగింపు వరకు సోషల్ మీడియాలో విపరీతమైన సందడి నడుస్తూ ఉంటుంది. బిగ్ బాస్ బృందానికి కూడా కావలసింది అదే. కావలసినంత ప్రచారం ఫ్రీగా లభిస్తుంది. పైగా రేటింగ్స్ కూడా పెరుగుతాయి. విపరీతమైన ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ విషయంలో బిగ్ బాస్ బృందానికి పెద్ద సెల్యూట్ చేయాల్సిందే.
ఇది కాయిన్ కు ఒకవైపు మాత్రమే. రెండో వైపు దారుణంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే అదంతా కూడా ఏ సర్టిఫికెట్ విధంగా ఉంది. బిగ్ బాస్ లో తరచుగా శృతిమించిన వ్యవహారాలు సాగుతున్నాయి. సోలో కంటెస్టెంట్లు గా ఉన్నవారు పరిధి దాటి సులువుగా మాట్లాడిస్తున్నారు. మాటలు ఈజీగా జారుతున్నారు. వాస్తవానికి తెలుగు ప్రేక్షకులు ఈ షోను చూస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఈ షో ను అమితంగా ఆదరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కంటెస్టెంట్స్ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నాగార్జున ఎన్నిసార్లు చెప్పినా.. బిగ్ బాస్ ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా తీరు అసలు మార్చుకోవడం లేదు. ఇక శనివారం నాటి ఎపిసోడ్లో అయితే దారుణంగా రెచ్చిపోయారు. ముఖ్యంగా త్రిగున్ ను లక్ష్యంగా చేసుకొని రోహిత్ మాట్లాడిన మాటలు వికృతంగా ఉన్నాయి.
ప్రస్తుతం షో చూస్తుంటే రోహిత్ వర్సెస్ అన్నట్టుగానే కొనసాగుతోంది. ఉప్పు నిప్పులాగా వీరిద్దరి మధ్య వ్యవహారం సాగుతోంది. ఒకరి మీద మరొకరు అప్పర్ హ్యాండ్ సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆటలో ఇలా ఉండాల్సిందే. కాకపోతే వ్యక్తిగతంగా బూతులు తిట్టుకోవడం దేనికి.. కొన్ని సందర్భాలలో పరిస్థితి చేయి దాటిపోయి.. చేతులు కలబడే వరకు వెళ్తోంది. హౌస్ లో.. ఇన్ని నిబంధనల మధ్య ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే.. ఒకవేళ మీరు బయటికి వెళ్తే ఏం చేసుకుంటారో అనే భయం కలుగుతోంది.
ప్రస్తుతం సాగుతున్న షోలో సుధీర్.. ముఖేష్.. వర్షిని.. రోహిత్ ఒక బృందంగా ఉన్నారు. వీరంతా కూర్చొని వాటాడుకుంటున్న సమయంలో ప్రస్తావన వచ్చింది. “ఆయిల్ తీసుకొని కేన్ కి పోసి.. గట్టిగా కొట్టేయాలి” అని రోహిత్ చెప్పాడు. దానికి వర్షిని మరింత నిప్పు పెట్టింది..”ఒకవేళ అదే నేనయితే కనిపించకుండా పోతుంది” అని వ్యాఖ్యానించింది. ముఖేష్ కూడా తక్కువ తినలేదు. ” నెట్టండి లాగండి” అన్నట్టుగా సైగలు చేశాడు. ఇదంతా కూడా వీడియో రూపంలో తిరిగింది చూసాడు. ఇక అంతకుముందు అయితే కొన్ని బూతు అక్షరాల మధ్య డ్రామా సాగింది. అయితే ఇంత రచ్చ జరగడానికి ప్రధాన కారణం రోహిత్.. ముఖేష్.. వర్షిని కావడం విశేషం. ఇక్కడతోనే ఆగిపోలేదు.. శివను మధ్యవర్తిగా అభివర్ణించారు. దానికి బి అనే పదం ఉంటుందని రోహిత్ అన్నాడు. వెంటనే వర్షిని అందుకుంది. పి అనే అక్షరంతో నా అంటూ దానికి మరింత అగ్గి రాసింది. పి అంటే ఏమిటి.. బి అంటే ఏమిటి అని నాగార్జున పదేపదే అడగడం ఇక్కడ విశేషం. పైగా దానికి ఎవరు నేరుగా సమాధానం చెప్పలేకపోయారు.
పి అనే పదాన్ని.. బి అనే పదాన్ని కాస్త మర్చిపోతే.. ఒక సన్నని ఇనుప రాడ్డుకు ఆయిల్ పూయడమేంటి.. దాన్ని దింపాలి అనుకోవడమేంటి.. అసలు ఇదెక్కడి గేమ్ షో.. ఇలా ఆడతారా.. ఇలాంటి మాటలు మాట్లాడతారా.. ఇంత కసి పెంచుకుంటారా.. అసలు మనుషుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారా.. లేదా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారా.. ఇటువంటి షోలను కుటుంబ సభ్యులు కలిసి చూస్తుంటారు. ఇందులో పిల్లలు కూడా ఉంటారు.. మరి అలాంటి వాళ్ళకి ఇలాంటి సో కాల్డ్ కంటెస్టెంట్లు ఏం చెబుతున్నట్టు.. ఇప్పటికే ఈ రియాల్టీ షోను నిషేధించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. వారి వాదనకు బలం చేకూర్చే విధంగా రోహిత్, ముకేష్, వర్షిని వ్యవహరిస్తున్నారు. అటువంటివారిని నాగార్జున గట్టిగా మందలించకపోవడం అసలైన విషాదం. పైగా వారు మాట్లాడుకున్న వీడియోను త్రిగున్ ను చూపించడమేటో అర్థం కావడం లేదు. దీనినిబట్టి మరింత రచ్చ చేయడానికి.. రేటింగ్స్ పెంచుకోవడానికి.. ఇటువంటి వ్యవహారాలకు నాగార్జున పాల్పడుతున్నాడా. . అసలు ఇటువంటి షోల ద్వారా నాగార్జున ఎంత సంపాదిస్తాడో తెలియదు గానీ.. ఉన్న గౌరవం మాత్రం పోగొట్టుకుంటాడు.. అని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ షో ఈ స్థాయి తోనే ఆగిపోతుందా.. ఇంకా మరింత రచ్చరంబోలా చేస్తుందా.. చూడాలి మరి.