Tollywood Heroine: టాలీవుడ్ హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ 2022 ఎవరో తెలుసా?

2020 సంవత్సరంలో సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు సినిమాలు మినహా కృతి శెట్టికి మరొక విజయం దక్కలేదు. అయినా కూడా ఆమెకు ఉన్న క్రేజ్ లో ఏమాత్రం తేడా లేదు.

  • Written By: Suresh
  • Published On:
Tollywood Heroine: టాలీవుడ్ హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ 2022 ఎవరో తెలుసా?

Follow us on

Tollywood Heroine: టాలీవుడ్ లో ప్రతి సంవత్సరం చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. వారిలో కొంత మంది మాత్రమే ఇండస్ట్రీలో నిలిచిపోతారు. కానీ మరికొంత మంది మళ్లీ కనిపించకుండా కనుమరుగైపోతారు. మరి 2022వ సంవత్సరంలో చాలా సినిమాలు వచ్చాయి. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటే.. మరకొంత మంది విమర్శలు ఎదుర్కొన్నారు. అందచందాలతో కొందరు మమరపిస్తే..నటనతో ఆకర్శించారు మరికొందరు. అసలు ఇందులో పై చేయి సాధించిన ఆ హీరోయిన్స్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా గత ఏడాది అంటే 2022లో పూజ హెగ్డే, అనుపమ పరమేశ్వరన్, మృనాల్ ఠాకూర్, శ్రీ లీల, రష్మిక, సాయి పల్లవి, కృతి శెట్టి వంటి హీరోయిన్స్ చాలా బిజీగా ఉన్నారు. దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది మృనాల్ ఠాకూర్. సీతారామంలో వీరిద్దరి నటనకు విమర్శకుల నుంచి అనేక ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా ఆమె చాలా క్రేజ్ ఉన్న హీరోయిన్ గా మారింది. అయితే ఆమె తొందరపడి ఎలాంటి సినిమాకి కమిట్ అవ్వడం లేదు. తన పాత్రకి ఎంత ప్రాధాన్యత ఉందో మాత్రమే చూసుకుంటుంది. సినిమా కథను అలాగే కంటెంట్, బ్యానర్ ఏంటి? హీరో ఎవరు అనే విషయాలను ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తుంది.

ఇక విరాటపర్వం, గార్గి వంటి సినిమాలతో సాయి పల్లవి బిజీగా కనిపించినప్పటికీ ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అవడంతో సాయి పల్లవి మరొక ప్రాజెక్ట్ ఒప్పుకోవడం లేదు. 2022వ సంవత్సరంలో ఎవరు ఊహించని విధంగా పాన్ ఇండియా చిత్రంగా ఎదిగిన కార్తికేయ 2 లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఆమె నటించిన 18 పేజేస్ కూడా బాగానే వసూలు సాధించింది. వరుస హిట్స్ లో నటించి అనుపమ ప్రస్తుతం కెరియర్ పీక్స్ లోనే ఉంది.

ఇక 2020 సంవత్సరంలో సంక్రాంతికి విడుదలైన బంగార్రాజు సినిమాలు మినహా కృతి శెట్టికి మరొక విజయం దక్కలేదు. అయినా కూడా ఆమెకు ఉన్న క్రేజ్ లో ఏమాత్రం తేడా లేదు. వచ్చే సంవత్సరం కూడా ఆమె అనేక సినిమాల్లో నటించనుంది. పెళ్లి సందడి, ధమాకా వంటి సినిమాలలో నటించి ప్రస్తుతం టాలీవుడ్ లో పర్ఫెక్ట్ క్రేజ్ హీరోయిన్ గా మారిపోయింది శ్రీ లీల. ఇక ధమాకా సినిమా తర్వాత ఆమె క్రేజ్ ఆకాశాన్ని అంటింది. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టుగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది రష్మిక. ఈ చిత్రం తర్వాత ఆమె బాలీవుడ్ లో యమ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అక్కడ టాప్ హీరోయిన్ లా మారింది రష్మిక. కానీ తెలుగులో ప్రాజెక్ట్ చేయడానికి మాత్రం అంగీకరించడం లేదు.

రాధే శ్యాం, ఆచార్య లాంటి సినిమాలతో పూజ హెగ్డే వరుస ప్లాపులు మూట కట్టుకుంది. అయినా కూడా ఆమెకు వరుస పెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఈ హీరోయిన్స్ అందరిలో కెల్లా 2022వ సంవత్సరానికి క్రేజీ హీరోయిన్ గా చెప్పుకోవాల్సి వస్తే ఖచ్చితంగా మృణాల్ పేరు చెప్పుకోవచ్చు. చేసిన ఒకే ఒక సినిమాతో అద్భుతమైన గుర్తింపు దక్కించుకుంది. అందుకే హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ గా మృణల్ ఠాకూర్ ని సెలక్ట్ చేయవచ్చు.సీతారామం సినిమాతో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది ఈ తార. ఇక రష్మిక మందన్నా పాన్ ఇండియా లెవల్ లో ఉంది కాబట్టి ఆమెను కూడా ఈ లిస్ట్ లో చేర్చవచ్చు. ఎన్నో సినిమాలు చేసి ఈ రేంజ్ కు రావడం కంటే ఒక సినిమాతో టాప్ పొజీషన్ లోకి వెళ్లడం గ్రేట్ అంటున్నారు వీరి అభిమానులు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు