Mahesh Babu: మహేష్ బాబు ఖాళీ సమయంలో వెకేషన్ తో పాటు ఈ అలవాటు కూడా ఉందా?

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో మహేష్ బాబు ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈయన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమాలో బిజీ కానున్నారు.

  • Written By: Suresh
  • Published On:
Mahesh Babu: మహేష్ బాబు ఖాళీ సమయంలో వెకేషన్ తో పాటు ఈ అలవాటు కూడా ఉందా?

Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించిన ఈ స్టార్ హీరో.. మంచితనంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అందరి మదిలో చెదరని గూడు కట్టుకున్నారు. చిన్న పిల్లలకు కష్టం వస్తే చూడలేని ఈ హీరో వారి కోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెడుతుంటారు. ఇలా మంచితనం, నటన, అందం ఉన్న స్టార్ హీరో సినిమా వస్తుందంటే థియేటర్లలో క్యూ కడుతుంటారు అభిమానులు. కృష్ణ వారసుడిగా అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో మహేష్ బాబు ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఈయన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమాలో బిజీ కానున్నారు. ఇలా సినిమాల పరంగా చాలా బిజీ అయిపోయారు మహేష్ బాబు. అయితే సినిమా షూటింగ్ లకు మధ్య మధ్య ఉండే గ్యాప్ లో ఈయన విదేశాలకు, ఇతర ట్రిప్ లకు వెళ్తుంటారు అని తెలిసిందే. వెకేషన్ వెళ్లడానికి వెనుకాడరు మహేష్ బాబు. ఖాళీ సమయం దొరికితే చాలు కుటుంబంతో సహా వెళ్తుంటారు. అయితే ఈ ఒక్క అలవాటు మాత్రమే కాదు మరో అలవాటు కూడా ఉందట ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా?

మహేష్ బాబుకి ఏ మాత్రం పని లేకుండా ఖాళీగా ఉంటే ఏదో ఒక బుక్ ను చేతిలో పట్టుకొని చదువుతూ ఉంటారట. మిల్క్ స్టార్ మహేష్ బాబుకు ఇంత మంచి అలవాటు ఉందా అనే ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. అయినా పుస్తకాలు చదివే అలవాటు చాలా మంది మరిచిపోయారు. అలాంటిది ఓ సూపర్ స్టార్ కు ఇలాంటి అలవాటు ఉండడం గ్రేట్ అంటున్నారు ఈయన అభిమానులు. ఖాళీ సమయంలో మాత్రమే కాదు జర్నీ చేసే సమయంలో కూడా పుస్తకాలు చదువుతూ ఉంటారట.

ఖాళీ సమయం దొరికితే వెకేషన్ వెళ్లడం, కుటుంబ సభ్యులతో గడపడం చేసే మహేష్ బాబు.. ఆ తర్వాత సమయం పుస్తకాలతోనే గడుపుతారని తెలుస్తోంది. ఇలా ఇంత మంచి అలవాట్లు ఉన్న మహేష్ బాబు సినిమాలు కూడా అదే రేంజ్ సక్సెస్ అవుతుంటాయి. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమా కోసం ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు