Jabardasth Satya Sri: జబర్దస్త్ సత్యశ్రీకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర టీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ టీమ్ లో ఉన్న సత్యశ్రీ ఊహించని స్థాయిలో గుర్తింపుతో పాటు విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు.

  • Written By: Suresh
  • Published On:
Jabardasth Satya Sri:  జబర్దస్త్ సత్యశ్రీకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

Follow us on

Jabardasth Satya Sri: జబర్దస్త్ కామెడీ షోపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయం తెలిసిందే. ఈ కామెడీ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొవచ్చు. అంతేకాదు ఈ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులుగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర టీమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ టీమ్ లో ఉన్న సత్యశ్రీ ఊహించని స్థాయిలో గుర్తింపుతో పాటు విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నారు. అంతేకాదు ఈ ప్రొగ్రాం చేసేందుకు ఆమె భారీగా పారితోషికం అందుకుంటారనే వార్త హల్ చల్ చేస్తుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యశ్రీ తన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిపారు. వెండితెరపై చేసిన లెజెండ్ సినిమాతో తనకు మంచి పేరు వచ్చిందన్నారు. ఆ సమయంలో డైలాగ్ ఎలా చెప్పాలి అనేది బోయపాటి శ్రీను యాక్టింగ్ చేసి చూపించారని అన్నారు. అలాగే సరైనోడు, జయ జానకి నాయక వంటి సినిమాల్లో నటించినట్లు తెలిపారు. రవితేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్ తనకు చాలా ఇష్టమైన చిత్రమన్న ఆమె అందులో తనకు మంచి పాత్ర దక్కిందని సత్యశ్రీ వెల్లడించారు. కానీ డేట్స్ కుదరకపోవడంతో కొన్ని ప్రాజెక్టులను వదులుకున్నట్లు ఆమె తెలిపారు.

అంతేకాకుండా మన్మథుడు నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన బంగార్రాజు సినిమాలో అవకాశాన్ని చేజార్చుకున్నట్లు సత్యశ్రీ వెల్లడించారు. 2014 లో పదో తరగతి అయిపోయిదన్న ఆమె తనకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టమని పేర్కొన్నారు. తన కోసం తన తల్లి ఇండస్ట్రీ లైఫ్ ను త్యాగం చేశారని చెప్పారు. అలాగే తన అమ్మమ్మ కాకినాడ జిల్లాకు చెందిన వారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే తన అమ్మమ్మ ప్రజల కోసం పార్టీ తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు చాలా మందికి ఉపాధి కల్పించారని పేర్కొన్నారు.

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సత్యశ్రీ తన నిజ జీవితంలో చాలా సింపుల్ గా ఉండటంతో ఆమెను అభిమానించే వారి సంఖ్య పెరుగుతోంది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు