Arjun Reddy: అర్జున్ రెడ్డి స్టోరీ ఆ ఓల్డ్ సినిమా కి కాపీ అని మీకు తెలుసా..?

సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా మాత్రం చాలా సెన్సేషనల్ హిట్ సాధించింది.ఇక ఈ సినిమా తెలుగులో కమల్ హాసన్ హీరో గా వచ్చిన సాగర సంగమం సినిమాకి కాపీ అని చాలామందికి తెలియదు.

  • Written By: Gopi
  • Published On:
Arjun Reddy: అర్జున్ రెడ్డి స్టోరీ ఆ ఓల్డ్ సినిమా కి కాపీ అని మీకు తెలుసా..?

Follow us on

Arjun Reddy: ఇండస్ట్రీలో ఉన్న చాలామంది వాళ్ళకంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి హర్నిశలు కష్టపడుతూ వాళ్ళకంటు ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది కొత్త డైరెక్టర్లు మాత్రం సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సినిమాలు చేస్తూఒక ట్రెండ్ క్రియేట్ చేస్తూ సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొత్త డైరెక్టర్లు చేసే సినిమాలు కూడా చాలా ఫ్రెష్ గా చేస్తుంటారు.

అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా మాత్రం చాలా సెన్సేషనల్ హిట్ సాధించింది.ఇక ఈ సినిమా తెలుగులో కమల్ హాసన్ హీరో గా వచ్చిన సాగర సంగమం సినిమాకి కాపీ అని చాలామందికి తెలియదు. ఎందుకంటే రెండు సినిమాల స్టోరీ గాని, స్క్రీన్ ప్లే గాని ఆల్మోస్ట్ ఒక పాటర్న్ లోనే సాగుతుంది.ఇక సాగర సంగమం సినిమాలో కమలహాసన్ కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.అలాగే అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ కి డాక్టర్ అవ్వాలని చాలా కోరికగా ఉంటుంది. అలాగే ఇద్దరు కూడా చాలా టాలెంటెడ్ పర్సన్స్ కానీ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని కోల్పోయి డ్రింక్ కి ఏడిక్ట్ అవుతారు.ఇలా ఒకే తరహా స్క్రీన్ ప్లే తో ఈ స్టోరీ ని నడిపిస్తూ వచ్చారు.

ఇక సాగర సంగమం సినిమాలో కమలహాసన్ ని ఓపెనింగ్ సీన్ లోనే ఒక ఫెయిల్యూర్ పర్సన్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు. దాని తర్వాత రెండు సినిమాలు కూడా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాయి. అక్కడ మనకు ఇద్దరి డ్రీమ్స్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు.ఇక అర్జున్ రెడ్డి సినిమా అనేది ఆల్మోస్ట్ సాగర సంగమం సినిమాని పోలి ఉండడంతో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు సాగర సంగమం సినిమాతోనే పోల్చి చెప్పారు.

అయితే నిజానికి అర్జున్ రెడ్డి సినిమా అనేది ఒక క్లీన్ లవ్ స్టోరీ గా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది అలాగే స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా మాత్రమే కాకుండా ఈ సినిమా అన్నివిభాగాల్లో కూడా తమదైన రీతిలో రాణించి మంచి సక్సెస్ ను అందుకుంది అంటే సౌండింగ్ పరంగా అయిన, మేకింగ్ పరంగా అయిన చాలా ఫ్రెష్ ఫీల్ ఉండడంతో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు