Chiranjeevi: ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరల తీసుకున్న చర్యలపై ఇటీవలె చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే పలువురు నిర్మాతలు, దర్శకులు స్పందించారు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ.. ట్వీట్ చేశారు.
Appeal to Hon’ble @AndhraPradeshCM
Sri.@ysjagan pic.twitter.com/zqLzFX8hCh— Chiranjeevi Konidela (@KChiruTweets) November 25, 2021
సినీ పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం అన్లైన్ టికెట్ బిల్ ప్రవేశపెట్టడం సరికాదని అన్నారు. థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా బతుకున్న ఎంతో మంది కుటుంబాల కోసం, తగ్గించిన టికెట్ ధరలను.. సముచితంగా.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే అదరికీ మేలు జరుగుతుందని చిరు తెలిపారు. దేశమంతా ఒకటే జీఎస్టీ ఉన్నప్పుడూ.. టికెట్ ధరల విషయంలో అదే వెసులుబాటు ఎందుకు ఉండకూడదని అన్నారు. దయచేసి ఈ విషయంపై పునరాలోచన చేయాలని జగన్ను విన్నపించుకుంటూ ట్వీట్ చేశారు.
Also Read: స్టార్ హీరోలకు జగన్ ఓ గండంగా మారాడు !
అటువంటి ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు సినీ పరిశ్రమ ఇంకా ముందుగు వెళ్తుందని అన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
కాగా, ఆచార్య సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రామ్చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, కాజల్, పూజా హెగ్డె హీరోయిన్లుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రరిలో ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: లక్కీఛాన్స్ కొట్టేసిన జబర్దస్ట్ బ్యూటీ.. చిరు సినిమాలో రష్మి?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Chiranjeevi request to the ap cm jagan abou cinema tickets
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com