Vishwambhara : చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్ లతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే బింబిసార (Bimbisaara) సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న వశిష్ట (Vashishta) డైరెక్షన్ లో విశ్వంభర (Vishvambhara) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా మే తొమ్మిదోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా బిజినెస్ ని భారీ రేంజ్ లో జరుపుకుంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా సక్సెస్ అనేది చిరంజీవికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఎందుకంటే ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే బాలయ్య బాబు(Balayya Babu) డాకు మహారాజ్ (Daaku Maharaj) సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటే, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ సీనియర్ హీరోలిద్దరూ భారీ సక్సెస్ లను అందుకున్న నేపధ్యంలో చిరంజీవి నుంచి వచ్చే సినిమా అంతకుమించిన సక్సెస్ సాధించాలి లేకపోతే మాత్రం ఆ సీనియర్ హీరోలిద్దరి ముందు తేలిపోతడానే చెప్పాలి… అందుకే ఆయన ఆచితూచి ఈ సినిమాని దగ్గరుండి మరి తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : విశ్వంభర రిలీజ్ మీద వీడని సస్పెన్స్…అనుకున్న టైమ్ కి వస్తుందా..? అసలు ఆలస్యానికి కారణం ఎవరు..?
మరి వశిష్ట లాంటి దర్శకుడు చిరంజీవితో చేస్తున్న భారీ గ్రాఫికల్ సినిమా కావడంతో ఈ సినిమా మీద యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారా? ఈ సినిమాతో చిరంజీవి మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటబోతున్నాడా? లేదా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి సక్సెస్ సాధించాలంటే మాత్రం ఈ సినిమా భారీ రేంజ్ లో ఎలివేట్ అవ్వాలి. లేకపోతే మాత్రం ఇప్పుడున్న వాతావరణానికి ఈ సినిమా ఏ మాత్రం తగ్గిన కూడా చిరంజీవి మీద చాలా విమర్శలైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరి ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది సినిమా మీద బజ్ అయితే పెరుగుతుంది. దాంతో పాటుగా ఈ సినిమాకి బిజినెస్ కూడా భారీ రేంజ్ లో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ సినిమాతో చిరంజీవి మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకుంటాడా పాన్ ఇండియాలో యంగ్ హీరోలే కాకుండా సీనియర్ హీరో అయిన చిరంజీవి కూడా తన సత్తా ఏంటో చూపిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
Also Read : ‘విశ్వంభర’ మరింత ఆలస్యం..ఈ ఏడాది విడుదల కష్టమేనా?..ప్రొడక్షన్ టీంపై మెగాస్టార్ మండిపాటు!