Chiranjeevi and Anil Ravipudi : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో అందుకొని గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఒకే ఒక హీరో మెగాస్టార్ చిరంజీవి… తన డాన్స్ తో ప్రేక్షకులను మెప్పించి, తన ఫైట్స్ తో యావత్ తెలుగు జనాలను తన అభిమానులుగా మార్చుకున్న నటుడు చిరంజీవి… 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ మెగాస్టార్ గా తనకున్న పేరు ప్రఖ్యాతలను కాపాడుకుంటూ వస్తున్నాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అయినప్పటికి ఎవ్వరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి చిన్నచిన్న అవకాశాలతో తనను తాను ప్రూవ్ చేసుకుంటూ స్టార్ హీరోగా, ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి గురించి మనం ఎంత మాట్లాడుకున్న తక్కువే అవుతుంది. ఆయన చేసిన సినిమాలు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. దాదాపు ఆరు సంవత్సరాలు వరుసగా 6 ఇండస్ట్రీ హిట్లను సాధించిన రికార్డు కూడా ఆయనకే సొంతం…అప్పటినుంచి ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవిని ఢీ కొట్టగలిగే హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు రాలేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో సైతం ఆయన యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర (Vishvam bhara) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ముగిసిన తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో చేయబోయే సినిమా ఈ సంవత్సరం జూన్ నెల నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. కేవలం ఆరు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేసి 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని బరిలో నిలపాలనే ప్రయత్నంలో అటు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఇటు చిరంజీవి (Chiranjeevi) భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీలో ఆ సినిమాలోని కామెడీ సీన్స్ ని మళ్ళీ వాడుతున్నారా..?
ఇక ఇప్పటికే కథను ఫైనల్ చేసే పనిలో భాగంగా అనిల్ ఇప్పుడు తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు. అయితే వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా కథ 1990 పిరియడ్ లో నడిచే కథ గా కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ విషయం మీద అనిల్ స్పందిస్తే కానీ సరైన క్లారిటీ యితే రాదు…ప్రస్తుతం అనిల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తాన్ని చూసుకునే పనిలో తను చాలా బిజీగా ఉన్నాడు. చిరంజీవి సైతం అనిల్ రావిపూడి సినిమా కోసం ఒక మంచి మేకోవర్ లో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు.
మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అంటూ ఇప్పటికే జనాల్లో విపరీతమైన అంచనాలైతే పెరిగిపోయాయి. నిజానికి చిరంజీవి లాంటి నటుడు దొరికితే యంగ్ డైరెక్టర్లందరూ వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.
మరి అనిల్ రావిపూడి సైతం చిరంజీవిని ఎలా చూపిస్తాడు తద్వారా చిరంజీవితో భారీ సక్సెస్ ను ఎలా అందుకుంటాడనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆయన ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సక్సెస్ ల పరంపరను మరొకసారి కొనసాగించే ఉద్దేశ్యం తోనే ఆయన ఈ సినిమాను చేస్తున్నట్టుగా తెలిస్తోంది…