Chiranjeevi and Ram charan : చిత్ర పరిశ్రమలో వారసత్వం చాలా కామన్. ఈ వారసత్వం పెద్ద బాధ్యత కూడాను. ఒక స్టార్ హీరో కొడుకుగా ఆ లెగసీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఎంత పెద్ద హీరో కొడుకు అయినా… టాలెంట్ లేకపోతే రాణించడం కష్టం. వారసత్వం ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుంది. స్టార్ కావాలంటే ప్రతిభతోనే సాధ్యం. దశాబ్దాల పాటు తెలుగు సినిమాను మకుటం లేని మహారాజుగా చిరంజీవి ఏలారు. నెంబర్ వన్ హీరో అనిపించుకున్నారు . 2007లో రామ్ చరణ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. చిరుత ఆయన డెబ్యూ మూవీ.
Also Read : చిరంజీవి రామ్ చరణ్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ మూవీ ఏంటి..? ఇంతకీ దర్శకుడు ఎవరు..?
అరంగేట్రంతోనే అదుర్స్ అనిపించిన రామ్ చరణ్.. రెండో చిత్రం మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు రామ్ చరణ్ లోని గొప్ప నటుడిని పరిచయం చేశాయి. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా రామ్ చరణ్ ఉన్నారు. చిరంజీవి గర్వపడే స్థాయికి రామ్ చరణ్ ఎదిగాడు. కాగా ఒక దశలో రామ్ చరణ్ ని తన కొడుకు అని చిరంజీవి చెప్పుకునేవాడు కాదట. రామ్ చరణ్ కి కూడా చెప్పకు అనేవాడట. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు.
రామ్ చరణ్ చెన్నైలో పుట్టాడు. బాల్యం అక్కడే గడిచింది. స్కూల్ లో రామ్ చరణ్ తాను చిరంజీవి కుమారుడిని అని చెప్పుకునేవాడు కాదట. అలాగే చిరంజీవి కూడా రామ్ చరణ్ నా కుమారుడు అని బయటకు తెలియనిచ్చేవాడు కాదట. అలా తెలిస్తే రామ్ చరణ్ ని టీచర్స్ ప్రత్యేకంగా చూస్తారు. ఫ్రెండ్స్ కూడా ఫ్రీగా కలిసిపోరు. అది రామ్ చరణ్ చదువు పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఒక సామాన్యుడి కొడుకుగానే స్కూల్ లో రామ్ చరణ్ కి గుర్తింపు ఉండాలని భావించేవారట.
ఇక రోజూ షూటింగ్స్ కి వెళ్లాలని రామ్ చరణ్ కోరుకునేవాడట. స్టడీస్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే చిరంజీవి అందుకు ఒప్పుకునేవాడు కాదట. వేసవి సెలవుల్లో మాత్రం అనుమతించేవాడట. ఇక మూవీ సెట్స్ లో చిరంజీవితో నటించే హీరోయిన్స్ రామ్ చరణ్ ని ముద్దు చేసేవారట. ఓ మూవీ సెట్స్ లో రాధిక.. ఒత్తుగా ఉన్న రామ్ చరణ్ కనుబొమ్మలు చూసి… నాకు కూడా నీలా కనుబొమ్మలు ఉంటే బాగుండేది. మేకప్ వేసుకునే బాధ తప్పేది, అన్నారట. బాల్యంలో జరిగిన ఈ విషయాలను రామ్ చరణ్ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నాడు.
Also Read : వాయనాడు బాధితుల కోసం ముందుకొచ్చిన రామ్ చరణ్ చిరంజీవి.. గొప్ప సాయం…