Vishwambhara
Vishwambhara : ‘భోళా శంకర్’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘విశ్వంభర'(Viswambhara Movie) అనే గ్రాఫిక్స్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బింభిసార’ ఫేమ్ వశిష్ఠ(Director Vasista) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రారంభంలో అంచనాలు భారీ లెవెల్ లో ఉండేవి. కానీ గత ఏడాది విడుదల చేసిన టీజర్ కారణంగా ఈ సినిమా పై అప్పటి వరకు ఉన్న అంచనాలన్నీ ఆవిరి అయిపోయాయి. గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా ఉందని, భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ బాహుబలి, కల్కి రేంజ్ లో ఉంటాయని ఊహిస్తే సెకండ్ గ్రేడ్ హీరో సినిమాకు ఉండే క్వాలిటీ మెగాస్టార్ సినిమాకి ఉందని, టీజర్ వరకు అభిమానులు, ప్రేక్షకులు క్షమించేస్తారు కానీ, సినిమాలో మాత్రం ఇలాంటి గ్రాఫిక్స్ ఉంటే మెగాస్టార్ కెరీర్ లో మరో డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిపోవడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
Also Read : విశ్వంభర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ రేంజ్ లో జరగబోతుందా..?
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. స్టోరీ వివరాల్లోకి వెళ్తే ఒక బ్రహ్మ రాక్షసుడు భూమి ఉండే చిన్న పిల్లలను, స్వర్గ లోకం లో ఉండే దేవకన్యలు ఎత్తుకొని పోతుంటాడట. అలా చిరంజీవి సోదరి కూతుర్ని ఈ రాక్షసుడు ఎత్తుకొని పోవడంతో, ఆ చిన్నారిని వెత్తుకుంటూ చిరంజీవి తన పయనం సాగిస్తాడట. అతనికి ఆంజనేయ స్వామి అండ కూడా ఉంటుంది. అలా ఆ స్వామి అనుగ్రహం తో చిన్నారి కోసం మూడు లోకాల ప్రయాణం ని కొనసాగిస్తాడట. ఈ క్రమంలో అతనికి ఎంతో మంది రాక్షసులు తారసపడుతారు, మధ్యలో ఒక దేవకన్య కూడా పరిచయం అవుతుంది. ఆమెని ఒక రాక్షసుడి నుండి చిరంజీవి రక్షిస్తాడు. అలా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా కూడా మారుతుందట.
అంతే కాకుండ ఆ దేవకన్య చిరంజీవి ని గమ్య స్థానానికి చేరుకోవడానికి సహాయ పడుతుంది. అసలు ఆ బ్రహ్మరాక్షసుడు ఎందుకు చిన్న పిల్లల్ని, దేవకన్యలు అపహరించి తీసుకెళ్తున్నాడు?, అతని ఉద్దేశ్యం ఏమిటి?, హీరో అతనితో వీరోచితంగా పోరాడి ఎలా తన సోదరి బిడ్డను కాపాడుకున్నాడు అనేది ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో చాలా అద్భుతంగా తెరకెక్కించాడట డైరెక్టర్. గ్రాఫిక్స్ విషయం లో ఒక్కటి శ్రద్ద తీసుకుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగానే ఈ సినిమాకి ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదని అంటున్నారు. ఎప్పుడో సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, ‘గేమ్ చేంజర్’ కారణంగా వాయిదా పడింది. వాయిదా వేసిన వెంటనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు కానీ, అది ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఉగాది లోపు విడుదల తేదీ వెలువడే అవకాశాలు ఉన్నాయి.
Also Read : విశ్వంభర రిలీజ్ మీద వీడని సస్పెన్స్…అనుకున్న టైమ్ కి వస్తుందా..? అసలు ఆలస్యానికి కారణం ఎవరు..?
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: The full story of the leaked vishwambhara movie if this story is true
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com