YSR Congress: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి సిక్కోలు సీనియర్ నేతలు దూరమైనట్టేనా? దాదాపు వారు ఒక నిర్ణయానికి వచ్చారా? ఇక పార్టీలో ఉండలేమని సంకేతాలు పంపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర రీజినల్ స్థాయి సమావేశానికి సీనియర్ నేతలుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం గైర్హాజరయ్యారు. కనీసం వారి కుమారులైన సమావేశానికి రాలేదు. దీంతో వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలని తేలిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. తమ్మినేని సీతారాం యాక్టివ్ గా ఉన్న సమయంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. అప్పటినుంచి ఆయన కూడా పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబు నియమితులయ్యారు. ఆయన నిర్వహించిన సమావేశానికి సైతం గైర్హాజరు కావడం విశేషం.
Also Read: నాగబాబు ఎమ్మెల్సీ.. కూటమి ఎట్టకేలకు ఫిక్స్!
* సీనియర్ మోస్ట్ లీడర్ ధర్మాన
ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ) సీనియర్ మోస్ట్ లీడర్. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నేత. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ప్రధాన అనుచరుడుగా కొనసాగారు. అందుకే 2014 ఎన్నికల సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. పార్టీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ జగన్ మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. మనస్థాపానికి గురయ్యారు. తొలి మూడేళ్లు పెద్దగా యాక్టివ్ గా లేరు. మంత్రి పదవి ఇచ్చినా పెద్దగా సంతృప్తి చెందలేదు. ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయారు. దాదాపు ఆ పార్టీతో తెగదింపులు చేసుకునేదాకా పరిస్థితి వచ్చింది.
* తమ్మినేని తీవ్ర మనస్థాపం
తమ్మినేని సీతారాం( tammineni Sitaram) తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. మధ్యలో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన తిరిగి టిడిపి గూటికి చేరారు. కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురయింది. 2019లో రెండోసారి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారు. అయితే ఈ ఎన్నికల్లో తన బదులు తన కుమారుడికి ఛాన్స్ ఇవ్వాలని తమ్మినేని సీతారాం కోరారు. కానీ జగన్ మాత్రం తమ్మినేని సీటు ఇచ్చారు. కానీ తమ్మినేని ఓడిపోవడంతో నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు తప్పించారు. ఆయన స్థానంలో ద్వితీయ శ్రేణి నాయకుడు చింతాడ రవికుమార్ కు బాధ్యతలు ఇచ్చారు. దీనిని వ్యతిరేకించారు తమ్మినేని. పార్టీ కార్యక్రమాలకు గైరహాజరవుతూ వచ్చారు. ఇప్పుడు కీలకమైన ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ నిర్వహించిన సమావేశానికి సైతం గైర్హాజరయ్యారు.
* ఎన్నికలకు ముందు నిర్ణయం..
శ్రీకాకుళం జిల్లాలో( Srikakulam district) ఈ ఇద్దరు నేతలు సీనియర్లు. కానీ వీరి పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. తెలుగుదేశం పార్టీలో ఛాన్స్ లేదు. జనసేనలో చేరేందుకు అవకాశం ఉంది. మరోవైపు బిజెపి సైతం వీరిని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ పార్టీకి జిల్లాలో పెద్దగా బలం లేదు. అందుకే ఈ ఇద్దరు నేతలు తమ వారసుల కోసం సరైన నిర్ణయం తీసుకునేందుకు వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ముందు ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read: వర్మ ప్రత్యర్థి జనసేనలోకి.. అలా షాక్ ఇచ్చిన పవన్!