Sreeja and Kalyan Dev : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆయన చిన్న కూతురు శ్రీజ(Sreeja Konidela) శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకొని, ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో పెను దుమారమే రేపింది. అప్పట్లో శ్రీజ ఇలా చేసానని తెలిస్తే మా బాబాయ్ పవన్ కళ్యాణ్ నన్ను చంపేస్తాడని, ఆయన నుండి నన్ను కాపాడాలి అంటూ మీడియా ముందుకొచ్చి మాట్లాడిన మాటలు కూడా అప్పట్లో ప్రకంపనలు రేపింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు శిరీష్ తో విడిపోయిన శ్రీజ ని చిరంజీవి మళ్ళీ దగ్గరకు తీసాడు. ఇప్పుడు ఆ శిరీష్ భరద్వాజ్ కూడా అనారోగ్యంతో గత ఏడాది కన్ను మూసాడు. అయితే శిరీష్ తో విడాకులు జరిగిన వెంటనే శ్రీజ కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ దేవ్ రెండు మూడు సినిమాల్లో హీరోగా కూడా చేసాడు.
Also Read : సంచలనం రేపుతున్న శ్రీజా కూతురు ఇంస్టాగ్రామ్ పోస్ట్..విడాకుల విషయం నిజమేనా?
వీళ్లిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, వీళ్లిద్దరు కూడా విడిపోయి చాలా కాలం అయ్యింది. అయితే నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా చిరంజీవి తన తల్లి అంజనా దేవి, తమ్ముడు నాగబాబు మరియు చెల్లెళ్ళతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూ లో ఇప్పటి వరకు అభిమానులెవ్వరికీ తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలియచేసాడు చిరంజీవి. మా అమ్మ నిర్ణయానికి ఇప్పటికీ ఇంట్లోని పిల్లలు ఎంతో విలువ ఇస్తారు, ముఖ్యంగా శ్రీజా జీవితం లో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఆ సమయంలో మా అమ్మ అండగా నిలబడింది. సందిగ్ద సమయంలో ఆమె తనకు మంచి నిర్ణయాలు కూడా ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై సోషల్ మీడియా లో అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. అంటే శ్రీజ జీవితం లో విడాకుల అంశం ఎంతో ముఖ్యమైనది, ఒకసారి కాదు, రెండు సార్లు ఆమెకు విడాకులు జరిగింది.
ఆ సమయం లో శ్రీజా విడిపోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, కచ్చితంగా అంజనా దేవి గారితో చర్చించే ఉంటుంది. ఆ సమయంలో అంజనా దేవి గారు శ్రీజ నిర్ణయానికే ఓటు వేసారా?, లేకపోతే ఆమె మాటని లెక్క చేయకుండా శ్రీజ విడాకులు తీసుకుందా?, ఒకవేళ అంజనా దేవి గారు విడాకులు తీసుకోవద్దు అని బలంగా చెప్పుంటే శ్రీజా ఆమె మాటకు కట్టుబడి ఉండేదా?, ఇలాంటి కోణాల్లో ఆలోచిస్తున్నారు నెటిజెన్స్. జీవితంలో అతి కష్టమైన సమయంలో పెద్దవాళ్లు కేవలం తమ అనుభవం నుండి వచ్చిన సలహాలు మాత్రమే ఇస్తారు. మనం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే మన జీవిత గమ్యం ముడిపడి ఉంటుంది. ఈ లెక్కన విడాకులు తీసుకోవాలి అనే నిర్ణయం పూర్తిగా శ్రీజా నిర్ణయమే అని మరికొందరు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. వీటిలో ఎంత మాత్రం నిజముందో, అసలు ఏమి జరిగిందో అనేది కేవలం వాళ్లకు మాత్రమే తెలుసు.
Also Read : మూడవ పెళ్లి కి సిద్దమైన చిరంజీవి కూతురు శ్రీజ