Ram Charan
Ram Charan : ఇండియన్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి చెరగని ముద్ర వేశారు. టాలీవుడ్ అగ్రహీరోగా దశాబ్దాలపాటు కొనసాగారు. తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి ట్రెండ్ సెట్టర్ గా ఉన్నారు. ఆయన పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. అలాంటి చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇవ్వడం సాధారణ విషయం కాదు. చెప్పాలంటే రామ్ చరణ్ పెద్ద బాధ్యతను తలకెత్తుకున్నారు. ఎందుకంటే చిరంజీవితో అన్ని విషయాల్లో ఆడియన్స్ పోల్చి చూస్తారు. అలాగే సక్సెస్ కాకపోతే, చిరంజీవి ఇమేజ్ సైతం డామేజ్ అవుతుంది.
అప్పట్లో స్టార్ దర్శకుడిగా వెలిగిపోతున్న పూరి జగన్నాధ్ కి రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యత చిరంజీవి అప్పగించారు. చిరుత టైటిల్ తో తెరకెక్కిన రామ్ చరణ్ మొదటి చిత్రం 2007లో విడుదలైంది. డాన్సులు, మేనరిజంలో తండ్రిని మురిపించిన రామ్ చరణ్, ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు. చిరుత ఓ మోస్తరు విజయం అందుకుంది. ఈ చిత్రానికి అశ్వినీ దత్ నిర్మాత. కాగా రామ్ చరణ్ చిరుత చిత్రానికి రెమ్యూనరేషన్ గా రూ. 50 లక్షలు తీసుకున్నాడని సమాచారం.
Also Read : రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో శివ రాజ్ కుమార్ పాత్ర ఎలా ఉండబోతుందంటే..?
ఒక డెబ్యూ హీరోకి అది చాలా పెద్ద మొత్తం. కానీ చిరంజీవి వారసుడు కావడంతో విపరీతమైన హైప్ ఏర్పడింది. సినిమాకు మార్కెట్ జరిగింది. దాని వలన అశ్వినీ దత్ భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఓ సందర్భంలో తన మొదటి సంపాదన ఎవరికి ఇచ్చాడో రామ్ చరణ్ తెలియజేశారు. నిర్మాత అశ్వినీ దత్ నాకు కాల్ చేశారు. నీ రెమ్యూనరేషన్ కి సంబంధించిన చెక్ ఇవ్వాలి, ఇంటికి వస్తున్నాను, అన్నారు. సరే సర్, నేను పైనే ఉంటాను. కిందికి రాను. అమ్మకు ఆ చెక్ ఇచ్చేయండి, అన్నాను.. అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.
కాబట్టి.. రామ్ చరణ్ తన ఫస్ట్ రెమ్యూనరేషన్ తల్లి సురేఖకు ఇచ్చాడన్నమాట. ఇక రామ్ చరణ్ ప్రస్తుత చిత్రాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ నిరాశపరిచింది. ఆశించిన స్థాయిలో ఆడలేదు. తన 16వ చిత్రం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో చేస్తున్నాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అనంతరం దర్శకుడు సుకుమార్ తో మూవీకి కమిట్ అయ్యాడు.
Also Read : చరణ్ తన కొడుకు అని చెప్పుకోవడానికి ఇష్టపడని చిరంజీవి… కారణం? ఇంట్రెస్టింగ్ స్టోరీ
Web Title: Ram charan first movie remuneration
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com