Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: వాడివేడిగా నామినేషన్స్, డేంజర్ జోన్లో టాప్ కంటెస్టెంట్స్

అమర్ తనకు కెప్టెన్సీ టాస్క్ లో సహజరించలేదని శివాజీని నామినేట్ చేశాడు. అర్జున్ కూడా నామినేట్ చేయడంతో శివాజీ ఫీల్ అయ్యాడు.

  • Written By: NARESH
  • Published On:
Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: వాడివేడిగా నామినేషన్స్, డేంజర్ జోన్లో టాప్ కంటెస్టెంట్స్

Follow us on

Bigg Boss 7 Telugu: 12 వారం రతిక, అశ్విని శ్రీ ఎలిమినేటైన విషయం తెలిసిందే. దీంతో హౌస్లో టాప్ 8 కంటెస్టెంట్స్ ఉన్నారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని తగు కారణాలు చెప్పి నామినేట్ చేయాలి. నామినేట్ చేసిన కంటెస్టెంట్ ముఖానికి రంగు పూయాల్సి ఉంది. శివాజీని మెజారిటీ కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. ప్రియాంక… మీరు నాపై ద్వేషం పెంచుకున్నారని కారణం చెబుతూ నామినేట్ చేసింది. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇక అమర్ తనకు కెప్టెన్సీ టాస్క్ లో సహజరించలేదని శివాజీని నామినేట్ చేశాడు. అర్జున్ కూడా నామినేట్ చేయడంతో శివాజీ ఫీల్ అయ్యాడు. అర్జున్ ఇచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసేశాడు. ఇక నామినేషన్స్ లో యావర్-శోభ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే యావర్ గట్టిగా ప్రశ్నించడంతో శోభ దొరికిపోయింది. మొత్తంగా వాడివేడి ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది.

శివాజీ, ప్రియాంక, శోభ, ప్రశాంత్, యావర్, అర్జున్, గౌతమ్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ వెల్లడించారు. ఒక్క అమర్ మాత్రమే నామినేషన్స్ లో లేడు. మిగతా 7 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. గౌతమ్, అర్జున్ డేంజర్ జోన్లో ఉన్నట్లు సమాచారం. సోమవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ప్రశాంత్, శివాజీ ఓటింగ్ లో టాప్ లో ఉన్నట్లు సమాచారం.

మరో మూడు వారాల్లో షో ముగియనుంది. టాప్ 8 నుండి టాప్ 5 ఫైనల్ కి వెళతారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. ఈ క్రమంలో డబుల్ ఎలిమినేషన్ లేదా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. రానున్న రెండు వారాల్లో ఇద్దరు ఎలిమినేట్ అయినా… మరొకరు మిగులుతారు. కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చు. సీజన్ 6లో కంటెస్టెంట్ సత్యశ్రీని మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చేసింది.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు