Nagarjuna: హోస్ట్ నాగార్జున చేతికున్న ఆ పరికరం స్మార్ట్ వాచ్ కాదా? మేటర్ తెలిస్తే షాక్ అవుతారు!

సదరు విమర్శలకు సమాధానంగా బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ చేశాడు నాగార్జున. 13వ వారంలో అడుగుపెట్టిన సీజన్ 7 విశేష ఆదరణ దక్కించుకుంటుంది.

  • Written By: NARESH
  • Published On:
Nagarjuna: హోస్ట్ నాగార్జున చేతికున్న ఆ పరికరం స్మార్ట్ వాచ్ కాదా? మేటర్ తెలిస్తే షాక్ అవుతారు!

Follow us on

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. గత ఐదు సీజన్స్ నుండి ఆయనే బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఒక్క సీజన్ 6లో ఆయన విమర్శల పాలయ్యారు. ఎన్నడూ చూడని దారుణ ఫెయిల్యూర్ ఆ సీజన్ చవిచూసింది. వీక్ డేస్ లో కేవలం 2 టీఆర్పీ నమోదు చేయగా వీకెండ్ 3కి మించేది కాదు. బిగ్ బాస్ సీజన్ 6 ఫెయిల్యూర్ కి నాగార్జునని కూడా బాధ్యుణ్ణి చేశారు. ఆయన హోస్టింగ్ లో పస తగ్గిందని విమర్శలు గుప్పించారు.

సదరు విమర్శలకు సమాధానంగా బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ చేశాడు నాగార్జున. 13వ వారంలో అడుగుపెట్టిన సీజన్ 7 విశేష ఆదరణ దక్కించుకుంటుంది. గత అనుభవాల రీత్యా షోని సరికొత్తగా రూపొందించారు. అదే సమయంలో నాగార్జున దుమ్ము లేపుతున్నాడు. 62 ఏళ్ల నాగార్జున గంటల తరబడి వేదిక మీద నిల్చొని షో చేయడం సామాన్యమైన విషయం కాదు. ఆయన ఫిట్నెస్ కి అది నిదర్శనం. ఒక ఎపిసోడ్ షూట్ చేయడానికి చాలా సమయం పడుతుంది.

నాగార్జున ఫిట్నెస్ కి కారణం ఆయన ఆహారపు అలవాట్లు, జీవన శైలి. నాగార్జున క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. డైట్ ఫాలో అవుతారు. అందుకే ఆయనకు వయసు కూడా కనబడటం లేదు. కాగా బిగ్ బాస్ షోలో నాగార్జున చేతికి ధరించిన ఓ పరికరం అందరినీ ఆకర్షించింది. అది స్మార్ట్ వాచ్ అని అందరూ భావించారు. కానీ అది స్మార్ట్ వాచ్ కాదు. దాని ప్రత్యేకలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

నాగార్జున చేతికి ఉంది ఫిట్నెస్ ట్రాకర్. అది నిరంతరం బాడీని గమనిస్తుంది. శరీరంలో జరిగే మార్పులను అంచనా వేసి అలర్ట్ చేస్తుంది. బీపీ లెవల్స్, అవయవాల పనితీరు, తీసుకునే ఆహారం, నీరు ఇలా ప్రతి విషయం అంచనా వేసి అలర్ట్ చేస్తుంది. ప్రతి నిమిషం మన హెల్త్ కి సంబంధించి అప్డేట్ ఇస్తుంది. ఇది ఒకసారి కొంటే సరిపోదు అట. ప్రతి నెలా రీఛార్జ్ చేయాలట. ఈ పరికరం వాడాలంటే ఏడాదికి రూ. 25 వేల వరకు ఖర్చు చేయాలని సమాచారం.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు