Bigg Boss 7 Telugu: షాకిస్తున్న ఓటింగ్ రిజల్ట్స్… ఆ కంటెస్టెంట్ మెడపై ఎలిమినేషన్ కత్తి

అమర్ దీప్ తప్ప మిగిలిన వారందరు నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. శివాజీ, శోభా శెట్టి, అర్జున్, గౌతమ్, యావర్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. కాగా ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండటంతో పోలింగ్ భారీగా జరుగుతుంది.

  • Written By: NARESH
  • Published On:
Bigg Boss 7 Telugu: షాకిస్తున్న ఓటింగ్ రిజల్ట్స్… ఆ కంటెస్టెంట్ మెడపై ఎలిమినేషన్ కత్తి

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 13వ వారం ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి ఫైనలిస్ట్ ఎవరో తేల్చేందుకు బిగ్ బాస్ టికెట్ టూ ఫినాలే రేస్ ప్రారంభించారు. ఇది పోటా పోటీగా సాగుతుంది. అమర్ దీప్ అందరికంటే ఎక్కువ పాయింట్లు సాధించి టాప్ లో ఉన్నాడు. ఇది ఇలా ఉంటె .. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది. అయితే 13వ వారం నామినేషన్స్ రంజుగా సాగాయి. ఇందులో మొత్తం ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు.

అమర్ దీప్ తప్ప మిగిలిన వారందరు నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. శివాజీ, శోభా శెట్టి, అర్జున్, గౌతమ్, యావర్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్ నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు. కాగా ఈ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండటంతో పోలింగ్ భారీగా జరుగుతుంది. టైటిల్ ఫేవరెట్ శివాజీ మొదటి రోజు ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ .. శివాజీకి గట్టి పోటీ ఇస్తున్నాడు. మొదటి రోజు శివాజీ టాప్ లో ఉండగా .. రెండవ రోజు నుంచి ప్రశాంత్ మొదటి స్థానంలో నిలిచాడు.

ఇద్దరూ స్వల్ప తేడాతో మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇక ప్రిన్స్ యావర్ మూడవ స్థానంలో స్థిరంగా ఉన్నాడు. అయితే మిగిలిన స్థానాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతానికి అర్జున్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక గౌతమ్ ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రియాంక ఆరో స్థానంలో ఉండగా .. శోభా శెట్టి ఎప్పటిలానే చివరి స్థానంలో ఉంది.

శోభా, ప్రియాంక డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ వాళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అర్జున్ లేదా గౌతమ్ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయబోతున్నారని సమాచారం. అదే కనుక జరిగితే శోభా లేదా ప్రియాంక లో ఒకరు టాప్ 5 లో ఉండే అవకాశం ఉంది. చూడాలి ఏం మరి జరుగుతుందో.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు