Samantha: వెండితెరకు దూరం… సమంత షాకింగ్ డెసిషన్!

సమంత నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉందట. ఈ ఏడాది సమయాన్ని సమంత ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తారట. గత ఏడాది సమంత మయోసైటిస్ బారిన పడింది. దాదాపు ఆరు నెలలు ఆమె ఇంటికే పరిమితమయ్యారు.

  • Written By: Shiva
  • Published On:
Samantha: వెండితెరకు దూరం… సమంత షాకింగ్ డెసిషన్!

Follow us on

Samantha: ఇండియాలోని టాప్ హీరోయిన్స్ లో సమంత ఒకరు. కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, బ్రాండ్ వాల్యూ ఉంది. సమంత కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి ఉంది. ఆమె కెరీర్ పీక్స్ లో ఉండగా షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంత సినిమాల నుండి విరామం తీసుకుంటున్నారట. ఓ ఏడాది పాటు ఆమె ఎలాంటి ప్రాజెక్ట్స్ కి సైన్ చేయరట. కొన్నాళ్ల పాటు ఆమెను అభిమానులు వెండితెర మీద మిస్ అవనున్నారని సమాచారం అందుతుంది.

సమంత నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉందట. ఈ ఏడాది సమయాన్ని సమంత ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తారట. గత ఏడాది సమంత మయోసైటిస్ బారిన పడింది. దాదాపు ఆరు నెలలు ఆమె ఇంటికే పరిమితమయ్యారు. చికిత్స తీసుకున్నారు. పూర్తిగా కోలుకోకుండానే ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ కోసం బయటకు వచ్చారు. ఈ క్రమంలో పూర్తి విశ్రాంతి తీసుకుని కోలుకోవాలని అనుకుంటున్నారట. ఈ విరామ సమయంలో చికిత్స తీసుకుంటూ మానసిక ప్రశాంత పొందాలనుకుంటున్నారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.

సమంత నిర్ణయం ఒకింత అభిమానులను నిరాశకు గురి చేస్తున్నప్పటికీ ఆమె అనారోగ్యం నుండి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం సమంత ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్ షూట్స్ లో పాల్గొంటున్నారు. ఖుషి క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటుందని సమాచారం. త్వరలో షూటింగ్ పూర్తి కానుంది. దర్శకుడు శివ నిర్వాణ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా ఖుషి తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది.

ఇక సిటాడెల్ షూటింగ్ కూడా ముగింపు దశలో ఉంది. ఇటీవల సెర్బియా దేశంలో ఒక షెడ్యూల్ చేశారు. సిటాడెల్ ఇంటర్నేషనల్ యాక్షన్ సిరీస్. ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తుంది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నాడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమ్ కానుంది. సమంత లేటెస్ట్ రిలీజ్ శాకుంతలం నిరాశపరిచింది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు