Sandeep Reddy Vanga: 36 ఎకరాల మామిడి తోట అమ్మేసిన యానిమల్ డైరెక్టర్.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

పెళ్లి చూపులతో హిట్ కొట్టినప్పటికీ విజయ్ దేవరకొండకు పెద్దగా ఇమేజ్ లేదు. కాబట్టి అతడి రెమ్యూనరేషన్ యాభై లక్షల లోపే. షాలిని పాండే కూడా కొత్త హీరోయిన్. దీంతో బడ్జెట్ లో అధిక భాగం మేకింగ్ కే ఖర్చు చేశారు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ ప్రొడ్యూస్ చేశారు.

  • Written By: NARESH
  • Published On:
Sandeep Reddy Vanga: 36 ఎకరాల మామిడి తోట అమ్మేసిన యానిమల్ డైరెక్టర్.. కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

Follow us on

Sandeep Reddy Vanga: జీవితంలో ఏం సాధించాలన్న ఆత్మవిశ్వాసం ఉండాలి. మనమీద మనకు నమ్మకం లేకపోతే ఎదుటి వాళ్ళు నమ్మరు. చిత్ర పరిశ్రమలో దర్శకుడు కావడం అంత సులభం కాదు. ఏళ్ల తరబడి నిర్మాతలు, హీరోల ఆఫీసుల చుట్టూ తిరిగినా అవకాశం రాకపోవచ్చు. సందీప్ రెడ్డి వంగ తాను దర్శకుడిగా రాణిస్తానని విశ్వసించాడు. తన డైరెక్టోరియల్ డెబ్యూ అర్జున్ రెడ్డి చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 5 కోట్లు.

పెళ్లి చూపులతో హిట్ కొట్టినప్పటికీ విజయ్ దేవరకొండకు పెద్దగా ఇమేజ్ లేదు. కాబట్టి అతడి రెమ్యూనరేషన్ యాభై లక్షల లోపే. షాలిని పాండే కూడా కొత్త హీరోయిన్. దీంతో బడ్జెట్ లో అధిక భాగం మేకింగ్ కే ఖర్చు చేశారు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ ప్రొడ్యూస్ చేశారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించారు.

కాగా ఈ సినిమా పెట్టుబడికి సందీప్ రెడ్డి వంగ తన 36 ఎకరాల మామిడి తోట అమ్మేశాడట. రూ. 1.5 కోట్లకు ఆ ప్రాపర్టీ అమ్మి అర్జున్ రెడ్డి మూవీ చేశాడట. ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ ఈ విషయం తెలియజేశాడు. ఒకవేళ అర్జున్ రెడ్డి ఆడకపోతే రోడ్డున పడాల్సి వచ్చేదని ఆయన పరోక్షంగా హింట్ ఇచ్చాడు. కుటుంబానికి చెందిన మామిడి తోట అమ్మి సందీప్ రెడ్డి వంగ దర్శకుడు అయ్యాడు.

అర్జున్ రెడ్డి పెట్టుబడికి పదింతలు అంటే రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు సందీప్ రెడ్డి. ఇక లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ వరల్డ్ వైడ్ వసూళ్లు కుమ్మేస్తుంది. యానిమల్ రూ. 600 కోట్ల మార్క్ చేరుకుంది. యానిమల్ నిర్మాణ భాగస్వామిగా సందీప్ రెడ్డి వంగ ఉన్నాడు. యానిమల్ తో దర్శకుడిగా, నిర్మాతగా అతడు కోట్లు సంపాదించనున్నాడు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు