spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Sambasiva Rao TV5: సాంబ సార్ ను ఇంతగా ఎవరూ ఆడుకోలేదు కావచ్చు.. ఏం ట్రోలింగ్...

Sambasiva Rao TV5: సాంబ సార్ ను ఇంతగా ఎవరూ ఆడుకోలేదు కావచ్చు.. ఏం ట్రోలింగ్ ఇదీ

Sambasiva Rao TV5: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు వేగంగా మారిపోతున్నాయి. తిరుపతి లడ్డు.. ఇంకా అనేక విషయాలు ఏపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలో వైసిపి అనుకూల మీడియా.. కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. కూటమి ప్రభుత్వానికి అనుకూల మీడియాగా పేరుపొందింది టీవీ5 ఛానల్. ఈ న్యూస్ ఛానల్ అధిపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్నారు.

టీవీ5 ఛానల్ మొదటినుంచి కూడా టిడిపికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలలో విభేదించినప్పటికీ.. మిగతా అన్ని సందర్భాలలో అనుకూలంగానే వార్తలను ప్రసారం చేస్తూ ఉంటుంది. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమలో పేరు పొందిన నటుడు కమల్ హాసన్ ఏపీలో కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీవీ5 ఛానల్ లో కీలక జర్నలిస్టు సాంబశివరావు స్పందించారు. కమల్ హాసన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. “తమిళనాడు రాష్ట్రంలో నీ పార్టీ పరిస్థితి చూసుకో. ఏపీ గురించి పక్కన పెట్టు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడి పరిపాలకులకు రాజకీయాలు ఎలా చేయాలో తెలుసని” సాంబశివరావు వ్యాఖ్యానించారు..

సాంబశివరావు మాటలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వైసీపీలో కీలకమైన డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సాంబశివరావు కు తెలుగులో కాకుండా.. తమిళంలో కౌంటర్ ఇచ్చారు. ప్రాంప్ట్ రీడర్ ను చూసుకుంటూ ప్రదీప్ రెడ్డి విమర్శలు చేయడం గమనార్హం. కమలహాసన్ తమిళ నటుడు కాబట్టి.. ఆయన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు కాబట్టి.. వైసిపి నేతలు కమల్ హాసన్ పై ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. అంతేకాదు ఆయనను విమర్శించిన కూటమి అనుకూల మీడియాకు ఇదిగో ఈ స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు..

గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. నాడు రజనీకాంత్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. కొడాలి నాని లాంటి వ్యక్తి అయితే ఏకంగా ఏక వచన సంబోధనతో రజనీకాంత్ ను విమర్శించారు. నాడు టిడిపి నేతలు రజనీకాంత్ ను వెనకేసుకొచ్చారు. ఇప్పుడు కమల్ హాసన్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. టిడిపి అనుకూల మీడియా కూడా అడ్డగోలుగా మాట్లాడుతోంది. ఇప్పుడు వైసీపీ నేతలు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. దీనినే రాజకీయ వైచిత్రి అంటారేమో!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper